నేషనల్ కెడెట్ కార్ఫ్స్(NCC News)ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు రక్షణ శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఎన్సీసీలో(NCC News Update) చేపట్టాల్సిన మార్పులపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు గురువారం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
మాజీ మంత్రి బైజయంత్ పాండ నేతృత్వంలోని ఈ కమిటీలో(NCC News) టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ(Dhoni news today), మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra News), ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే సభ్యులుగా ఉన్నారు.
కమిటీలో 15 మంది..
మాజీ కర్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్స్లర్ నజ్మా అఖ్తర్, వసుధ కమాత్(ఎస్ఎన్డీటీ ఉమెన్స్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్), ముకుల్ కనిట్కర్(భారతీయ శిక్షాన్ మండల్ జాతీయ కార్యదర్శి), అలోక్ రాజ్(రిటైర్డ్ మేజర్ జన్రల్), రితురాజ్ సిన్హా(ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్), ఆనంద్ షా(డేటాబుక్ సీఈఓ)ను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది డిఫెన్స్ శాఖ.
ఎన్సీసీలో చేరే యువత దేశం కోసం మరింత కృషి చేసేలా తయారు చేసేందుకు సంస్కరణలు చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఎన్సీసీ ద్వారా యువతలో క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపింది.
1948, నేషనల్ కెడెట్ కార్ఫ్స్ యాక్ట్ కింద ఎన్ఎన్సీ ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఎన్సీసీ క్యాడెట్స్‌కు గుడ్‌న్యూస్- ఆ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా!