ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం - కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ము కశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరాలోని ఓ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Bandipora encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Jul 24, 2021, 9:44 AM IST

Updated : Jul 24, 2021, 7:23 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బందిపొరాలోని శోక్​బాబా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో.. ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

జమ్ము కశ్మీర్​ పోలీసులతో పాటు సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శోక్​బాబా అటవీ ప్రాంతంలోని సుంబ్లార్ వద్ద భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం వల్ల ఎన్​కౌంటర్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు, బలగాలు సైతం దీటుగా కాల్పులు జరిపాయని చెప్పారు.

ఇదీ చదవండి: సిలిండర్​ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

Last Updated : Jul 24, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.