ETV Bharat / bharat

ఇంకా తగ్గని ఆకలి బాధలు.. హంగర్​ ఇండెక్స్​లో భారత్​కు 107 స్థానం! - The Global Hunger Index

Global Hunger Index 2022 : ప్రపంచ ఆకలి సూచీలో భారత్​ స్థానం​ మరింత దిగజారింది. తాజాగా విడుదలైన జీహెచ్​ఐ వార్షిక సర్వే నివేదికలో భారత్​కు 107 స్థానం దక్కింది. కాగా, ఈ నివేదికను భారత ప్రభుత్వం ఖండించింది.

hunger index india
india gets 107 place in hunger index survey
author img

By

Published : Oct 15, 2022, 1:32 PM IST

Updated : Oct 15, 2022, 10:32 PM IST

Global Hunger Index 2022 : ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్​ఐ) వార్షిక సర్వేలో భారత స్థానం మరింత దిగజారింది. తాజా నివేదికలో భారత్‌కు 107వ స్థానం దక్కింది. కన్‌సర్న్‌ హంగర్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. గతేడాది 116 దేశాల్లో నిర్వహించిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101 స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో మొత్తం 121 దేశాలను పరిగణలోకి తీసుకుని ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక 64, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్‌ 99 స్థానాల్లో నిలిచాయి.

ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను గతంలో కేంద్రం ఖండించింది. ప్రస్తుత సూచీపై కాంగ్రెస్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో 22.4 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగు స్థానానికి చేరుకుందన్న చిదంబరం.. దీనిపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని విమర్శించారు.

కాగా, ఈ నివేదికను భారత ప్రభుత్వం తప్పుపట్టింది. ఆకలిని సరైన ప్రమాణాలతో కొలవలేదని వ్యాఖ్యానించింది. ఈ నివేదికతో తీవ్రంగా ఆవేదన చెందామని పేర్కొంటూ.. కేంద్ర మహిళా శిశుసంక్షేమ, అభివృద్ధి శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆకలి సూచీలో పరిగణనలోకి తీసుకున్న నాలుగు అంశాల్లో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవేనని, దీనిని జనాభా మొత్తానికి ఆపాదించలేమని వ్యాఖ్యానించింది. పోషకాహారలోపాన్ని 3వేల మందిని ఒక యూనిట్‌గా భావించి లెక్కిస్తారనీ, ప్రస్తుత సూచీ ప్రమాణాలు సరైనవి కాదని, ఇలాంటి ప్రమాణాలతో వాస్తవికత దెబ్బతింటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ సమయంలో జనాభాకు ఆహారభద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించింది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్లో విడుదలయ్యే సినిమాలపై కమిటీ ఎలా వేయగలం?: సుప్రీంకోర్టు

పది నెలల్లో 13 మంది బలి.. ఎట్టకేలకు చిక్కిన 'సీటీ-1' పులి

Last Updated : Oct 15, 2022, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.