ఉత్తర్ ప్రదేశ్ బందాలో వివాహితపై జరిగిన అత్యాచార ఘటన మలుపు తిరిగింది. మహిళ చేసిన ఆరోపణలన్నీ నిరాధారణమైనవని తేల్చిచెప్పారు పోలీసులు. తన భర్తతో కలిసి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు మద్యం తాగించి తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే.. తదుపరి విచారణలో అసలు విషయం తెలిసింది.
బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం..
ఆ మహిళ తన భర్తతో పాటు తమ గ్రామానికి బైక్‌పై వెళ్తోంది. వారితో పాటుగా అదే గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నిందితులు కూడా బైక్ పై వస్తున్నారు. అయితే వారు మార్గం మధ్యలో బాధితురాలికి, ఆమె భర్తకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్తను సిగరెట్లు కొనేందుకు పంపించారు. తర్వాత ఒంటరిగా ఉన్న ఆమెపై ఇద్దరు నిందితులు వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారిపై తిగబడినందుకు మూడో వ్యక్తి ఆమె ప్రైవేటు భాగాల్లోకి గాజు సీసాను చొప్పించాడు.
ఈ దారుణమైన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మహిళను విచారించి.. వివరాలను తెలుసుకున్నారు. బాధితురాలు తెలిపిన సమాచారం ప్రకారం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
" దేహత్ కొత్వాలి ప్రాంతంలో ఓ వివాహిత గ్యాంగ్ రేప్‌కు గురైందనే సమాచారం అందింది. ఘటనా సమయంలో నిందితులు, బాధితురాలు, ఆమె భర్త అంతా మద్యం సేవించి ఉన్నారని దర్యాప్తులో తేలింది. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు ఇంతవరకు లభించలేదు. తదుపరి వివరాలకోసం దర్యాప్తు చేపట్టాం".
- లక్ష్మీ నివాస్ మిశ్రా, ఏఎస్పీ
ఇదే విషయమై ట్విట్టర్లో మరింత స్పష్టత ఇచ్చారు బందా పోలీసులు. సామూహిక అత్యాచారం చేశారని, ప్రైవేటు భాగాల్లో సీసాను చొప్పించారని మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని తేల్చిచెప్పారు. అయితే.. ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: