హిమాచల్‌ప్రదేశ్ లాహౌల్-స్పిటి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీంతో రైతులు, లోయలోని వ్యవసాయ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాహౌల్ లోయలో రైతులు తమ పొలాలను పంటలు వేయడానికి సిద్ధం చేసుకునే సమయమిది. అయితే హిమపాతం కారణంగా.. అందుకు వీలుపడటం లేదు. పండ్లు, కూరగాయల పంటలు రైతులకు చేతికొచ్చే వేళ.. అవి మంచులో కూరుకుపోయి పాడైపోతున్నాయి.
రహదారులపై మంచు పేరుకుపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లాహౌల్ వ్యాలీకి ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. జన జీవనం స్తంభించింది.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్‌ను కమ్మేసిన మంచు- ప్రజల ఇక్కట్లు