కరోనా నేపథ్యంలో దిల్లీలో ఇంటి వద్దకే రేషన్ సరకుల కార్యక్రమాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు ఆ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజల ప్రయోజనార్థం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రేషన్ దుకాణాలు.. కరోనా వ్యాప్తికి హాట్స్పాట్లుగా మారుతాయని హెచ్చరించారు.
పిజ్జాలు, బర్గర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, దుస్తులు ఇంటి వద్దకే వచ్చి అందిస్తుండగా.. రేషన్ సరకులు ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి తమకు కేంద్రం అనుమతి అవసరం లేదని, అయినా ఎలాంటి వివాదం రాకుండా ఉండేదుకు, కేంద్రానికి అయిదు సార్లు అభ్యర్థించామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
అయినప్పటికీ కేంద్రం అనుమతి కోరలేదనే కారణంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమ అభ్యర్థనను తిరస్కరించారని పేర్కొన్నారు కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం.. బంగాల్, ఝార్ఖండ్, లక్షద్వీప్, దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు సహా ప్రతి ఒక్కరితో ఘర్షణ పడుతోందని మండిపడ్డారు. తాము ఇలాగే వివాదాలు ఎదుర్కొంటూ ఉంటే కరోనాతో ఎలా పోరాడతామని అన్నారు.
ఇదీ చదవండి:'టీకా కేంద్రం'లో పుట్టినరోజు వేడుకలు