Widowed daughter in law remarried: కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో చీకటిమయం చేసింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు.. భర్తలను పోగొట్టుకున్న భార్యలు ఎందరో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబం ఇలాంటి బాధనే అనుభవించింది. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల వయసు ఉన్న కూతురు ఉన్నారు. ప్రియాంక్ మృతితో వీరంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
అయితే, కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఆలోచించారు. ఆమెను తమ సొంత కూతురిలా భావించి.. మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఆమెకు కొత్త జీవితం ప్రసాదించారు. అక్షయతృతియ రోజున నాగ్‌పుర్‌లో ప్రియాంక వివాహం జరిపించారు. కోడలికి తల్లిదండ్రులుగా మారి దగ్గరుండి వేడుకలో పాల్గొన్నారు. వివాహమే కాదు.. తమ కుమారుడి ఇంటినీ కోడలికి రాసి ఇచ్చారు. ఎంతో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న యుగ్ప్రకాశ్ దంపతులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి:
యువనటి మృతి.. భర్త అరెస్ట్.. పెళ్లయిన ఏడాదిన్నరలో ఏం జరిగింది?