ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో అందరికీ చేరువకావాలంటే సామాజిక మాధ్యమాలే మార్గం. ప్రస్తుత సార్వత్రికంలో డిజిటల్ మాధ్యమాలన్నీ రాజకీయ పార్టీల ప్రకటనలతో నిండిపోయాయి.
ఫేస్బుక్.. భాజపాలదే పైచేయి
రాజకీయ ప్రకటనల్లో ఫేస్బుక్, గూగుల్ టాప్లో నిలిచాయి. ఫిబ్రవరి-మే మధ్యకాలంలో ఈ రెండు సంస్థలకు పార్టీలు రూ.53 కోట్లు కుమ్మరించాయి. పార్టీలపరంగా చూస్తే భాజపా మొదటిస్థానంలో ఉంది. ఫేస్బుక్లో ప్రకటనలు, పేజీల కోసం రూ.4.23 కోట్లు.. గూగుల్లో రూ.17కోట్లు ఖర్చు చేసింది కమలదళం.
ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ నివేదిక ప్రకారం మొత్తం 1.21 లక్షల రాజకీయ ప్రకటనలు పోస్ట్ కాగా రూ.26.5 కోట్లు అర్జించింది ఆ సంస్థ. గూగుల్, యూట్యూబ్, ఇతర భాగస్వామ్య మాధ్యమాలు కలిపి 14,837 ప్రకటనలతో రూ.27.36 కోట్లు సంపాదించాయి.
కాంగ్రెస్
- ఫేస్బుక్: ప్రకటనలు-3,686... ఖర్చు-రూ.1.46 కోట్లు
- గూగుల్: ప్రకటనలు-425... ఖర్చు-రూ.2.71కోట్లు
తృణమూల్ రూ.29.28 లక్షలు, ఆమ్ఆద్మీ పార్టీ రూ.13.62 లక్షలు ఖర్చు పెట్టాయి.
ఇదీ చూడండి: 'సార్వత్రికం' తుది దశ: లైవ్ అప్డైట్స్