ETV Bharat / bharat

ముంబయి లాల్​బాగ్​ గణేశుడికి ఈ ఏడాది విశ్రాంతి - లాల్ బాగ్చా రాజా

ముంబయిలో ఏటా ఘనంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించే లాల్​ బాగ్ సార్వజనీక్ గణేశ్​ మండలి ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయించింది. నగరంలో వైరస్ ఉద్ధృతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఉత్సవాలకు బదులుగా రక్తదాన శిబిరం, కొవిడ్ బాధితులకు ప్లాస్మా సాయం చేస్తామని వెల్లడించింది.

lalbag
ముంబయి లాల్​బాగ్​ గణేశుడికి ఈ ఏడాది విశ్రాంతి
author img

By

Published : Jul 1, 2020, 10:55 AM IST

మహారాష్ట్ర ముంబయిలోని ప్రసిద్ధ లాల్‌ బాగ్ రాజా గణేశ్ మండలి.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ముంబయిలో వైరస్ వ్యాప్తి, కేసుల పెరుగుదల కారణంగా రాబోయే గణేశ్ ఉత్సవాలను నిర్వహించకూడదని నిర్ణయించింది. ఉత్సవాలకు బదులుగా సీఎం రిలీఫ్ ఫండ్​కు నిధులు అందిస్తామని, పాక్- చైనా సరిహద్దు వెంట అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు నిర్వాహకులు. మంటపం ఏర్పాటు చేసే స్థలంలో కరోనా బాధితులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గణేశ్ నవరాత్రుల సమయంలో ఈసారి కొవిడ్ బాధితులకు ప్లాస్మాను సైతం అందిస్తామని పేర్కొన్నారు.

1934లో ప్రారంభమైన లాగ్‌బాగ్​ రాజా గణేశ్ ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతుంటాయి. ప్రత్యేకమైన ఇతివృత్తంతో గణేశుడిని ఏర్పాటు చేస్తుంటారు. గతేడాది అంతరిక్ష యాత్ర థీమ్​తో ఉత్సవాలు నిర్వహించారు.

లాల్​బాగ్ గణేశుడు

ఇదీ చూడండి: డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.