కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని ఉభయ సభల ప్రధాన కార్యదర్శులు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఒకరోజు రాజ్యసభ మరో రోజు కాకుండా రెండు సభలనూ ఏకకాలంలో, యథాస్థానాల్లోనే నిర్వహించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.
కరోనా నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు శనివారం చర్చించారు.
పార్లమెంటు గ్రంథాలయ భవనంలోని బాలయోగి ఆడిటోరియం, సెంట్రల్ హాల్, ఉభయ సభల గ్యాలరీలు, లాబీలను సమావేశాల ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై స్పష్టత లేకపోయిన.. సెప్టెంబర్ 22 లోపే జరగాలి. నిబంధనల మేరకు రెండు సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలకు మించకూడదు.
అంతకుముందు.. ఏప్రిల్ 3 వరకు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23న వాయిదా పడ్డాయి.
ఇదీ చూడండి:'మహా'లో కరోనా విజృంభణ.. కొత్తగా 8,139 కేసులు