ETV Bharat / bharat

'ప్రత్యేక రైళ్లు వారి కోసం మాత్రమే.. మీరు రావద్దు' - రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు

దేశంలో రైళ్ల ప్రయాణంపై రైల్వేశాఖ స్పష్టత నిచ్చింది. రాష్ట్రాల అభ్యర్థన మేరకే వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యటకుల తరలింపు కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు వెల్లడించింది. అందువల్ల ఎవరు స్టేషన్లకు రావద్దని పేర్కొంది.

author img

By

Published : May 3, 2020, 9:26 AM IST

లాక్​డౌన్​ వల్ల దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యటకల తరలింపు కోసమే ప్రత్యేక రాళ్లను నడుపుతున్నట్టు రైల్వేశాఖ స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. అందువల్ల ఇతరులు రైల్వే స్టేషన్లకు రావొద్దని సూచించింది.

"దేశంలోని ఏ స్టేషన్​లోనూ టికెట్లు అమ్మట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మినహా ఇతర రైళ్లను నడపడం లేదు. అధికారులు తీసుకొస్తున్న వారికే రైలు ప్రయాణం అందిస్తున్నాం. ప్యాసింజర్​ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. అందువల్ల ఎవరూ స్టేషన్లకు రాకూడదు. ఈ విషయంపై అసత్య వార్తలను సృష్టించవద్దని వినతి."

-- రైల్వేశాఖ ప్రకటన.

కరోనాపై పోరులో భాగంగా రైలు, విమాన సేవలు రద్దయ్యాయి. అయితే వలస కార్మికులతో పాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తమ ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది.

ఇదీ చూడండి:- 'హాయిగా నిద్రపోండి.. కలల్ని దూరం చేసుకోకండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.