ETV Bharat / bharat

కమిటీలోని ఆ నలుగురూ సాగు చట్టాలకు మద్దతుదారులే! - రైతుల ఆందోళనలు

సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై రైతు సంఘాలు, విపక్షాలు పెదవి విరిచాయి. సభ్యులంతా గతంలో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనని పేర్కొంటున్నాయి. నిపుణుల కమిటీలో ఉన్నవారెవరు?

four-member committee
సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ
author img

By

Published : Jan 13, 2021, 8:39 AM IST

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఉభయులతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై రైతు సంఘాలు, విపక్షాలు పెదవి విరిచాయి. సభ్యులంతా గతంలో ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీలో ఉన్న వ్యక్తులెవరు? వారి నేపథ్యమేంటి? కొత్త వ్యవసాయ చట్టాలపై వారి అంతరంగమేంటని చూస్తే..

అనిల్‌ ఘన్వాట్‌

శేత్కరీ సంగఠన్‌ అధ్యక్షుడు. ఇది మహారాష్ట్రలోని రైతులకు సంబంధించిన సంఘం. దీని స్థాపకులు శరద్‌ జోషి. ఆర్థికవేత్త అయిన ఆయన స్విట్జర్లాండ్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసేవారు. భారత్‌కు తిరిగి వచ్చాక పుణె దగ్గర భూమి కొనుక్కొని రైతుగా మారారు. ఉల్లి రైతులకు ధర పెంచాలంటూ 1979లో పుణె-నాసిక్‌ రహదారిపై ధర్నా చేసి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. గ్రామీణ రైతుల కష్టాలు, నష్టాల గురించి తెలియాలంటే.. వారికి న్యాయం జరగాలంటే పట్టణాల్లోనే ఆందోళన చేయాలని సూచించి, ఆచరించిన వ్యక్తి శరద్‌జోషి. అలా శేత్కారీ సంగఠన్‌ పేరిట రైతుల సంఘాన్ని ఏర్పాటు చేసి.. మహారాష్ట్రలో చెరకు, పత్తి రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. బహిరంగ విపణి వ్యవస్థ కావాలని కోరుతూ వచ్చారు. ఆయన శిష్యుడు 61 సంవత్సరాల అనిల్‌ ఘన్వాట్‌. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటే రోడ్డుపైకి వస్తామంటూ.. హెచ్చరించారు. పంజాబ్‌, హరియాణాల రైతులే చట్టాలను వ్యతిరేకిస్తున్నారనీ.. వారి మాట విని మిగిలిన రైతులందరినీ దెబ్బ తీయొద్దనేది ఆయన సూచన.

four-member committee
అనిల్‌ ఘన్వాట్‌

అశోక్‌ గులాటి

ప్రముఖ వ్యవసాయ ఆర్థికశాస్త్రవేత్త.. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై భారత ఆర్థిక పరిశోధన సంస్థ (ఐసీఆర్‌ఐఈఆర్‌)లో ఆచార్యుడిగా పనిచేస్తున్న గులాటీ గతంలో వ్యవసాయ ధరల కమిషన్‌ ఛైర్మన్‌గా కూడా చేశారు. వాజ్‌పేయీ సర్కారులో ప్రధాని ఆర్థిక సలహా మండలిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక సలహామండలి సభ్యుడిగా, కర్ణాటక ప్రణాళికా మండలి సభ్యుడిగా కూడా చేశారు. అనేక ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచటానికి ఈయనే మూలకారకుడని చెబుతారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై ఈ మధ్యే ఓ జాతీయ పత్రికకు వ్యాసం రాస్తూ.. "వీటివల్ల కలిగే లాభాలను రైతులకు తెలియజెప్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది" అని గులాటి అభిప్రాయపడటం గమనార్హం.

four-member committee
అశోక్‌ గులాటి

భూపీందర్‌సింగ్‌ మాన్‌

భూపీందర్‌సింగ్‌ మాన్‌.. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మద్దతుదారుడు. రైతుల కోసం చేసిన పోరాటాలకుగాను.. 1990లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. ప్రస్తుతం భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) చీలిక వర్గం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే అంగీకారయోగ్యమేనని మాన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తే చాలన్నారు.

four-member committee
భూపీందర్‌సింగ్‌ మాన్‌

ప్రమోద్‌ కుమార్‌ జోషి

వ్యవసాయ పరిశోధన రంగంలో చాలామందికి తెలిసిన ప్రమోద్‌కుమార్‌ జోషిది ఉత్తరాఖండ్‌! హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన మేనేజ్‌మెంట్‌ అకాడమీ డైరెక్టర్‌గా, అంతర్జాతీయ ఆహార విధాన అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర చట్టాలకు ఈయన పూర్తి సమర్థన ఉందంటారు. కొత్త చట్టాలను ఏమాత్రం బలహీనపర్చినా భారత వ్యవసాయరంగం తన ముందున్న అంతర్జాతీయ అవకాశాలను దెబ్బతీసుకుంటున్నట్లే అవుతుందని ఇటీవల ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో జోషి విస్పష్టంగా అభిప్రాయపడ్డారు.

four-member committee
ప్రమోద్‌ కుమార్‌ జోషి

ప్రభుత్వ అనుకూల కమిటీ న్యాయమెలా చేస్తుంది?

కోర్టు నియమించిన కమిటీలోని సభ్యులు సంస్కరణలకు అనుకూలం. వారంతా చట్టాలకు రాతపూర్వకంగా మద్దతు పలికారు. వారి ద్వారా న్యాయం జరుగుతుందని నిరసనకారులు ఎలా ఆశించగలరు?

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నాయకుడు

ఇదీ చూడండి: సాగు చట్టాలపై సుప్రీం స్టే- వివాద పరిష్కారానికి కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.