'గిరిజనుల్ని కాల్చి వేసేందుకు కొత్త చట్టం తెచ్చారు' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. జాతీయ గిరిజనుల కమిషన్ జారీ చేసిన నోటీసులకు సమాధానంగా.. "ఆ వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగ ఉరవడిలో చేశాను" అని స్పష్టం చేశారు రాహుల్.
మధ్యప్రదేశ్‌లోని షాడోల్లో ఏప్రిల్ 23న జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. 'మోదీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో గిరిజనుల్ని కాల్చివేయొచ్చని వ్యాఖ్యం ఉంది. వాళ్లు మీ భూమిని లాక్కొంటారు. చివరికి గిరిజనుల్ని కాల్చివేయొచ్చని చెబుతారు' అని పేర్కొన్నారు.
మీడియాలో వచ్చిన కథనాల మేరకు మే 3న కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసులు జారీ చేసింది ఎన్సీఎస్టీ.
ఇదీ చూడండి: పార్లమెంట్లో 10 ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టిన కేంద్రం