ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో అవాంఛనీయ ఘటన జరిగింది. పోలీసులు కాల్పులు జరపిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయయ్యాయి.
గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో స్థానికులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది స్థానికులు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు పోలీసు ఇన్స్పెక్టర్ లక్ష్యంగా రాళ్లదాడి చేశారు.
"బూత్ నెంబర్ 36 వద్ద స్థానికులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించారు. ఈ కారణంగా పోలీసులు కాల్పులు జరిపారు. "
-పోలీస్ అధికారి
ఇదీ చూడండి: అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం!