పంపా నది... అయ్యప్ప భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. శబరిమల యాత్రకు వెళ్లిన వారు అందులో పవిత్ర స్నానం చేసి తీరాల్సిందే. అయితే... భక్తుల తాకిడితో పాటు నదిలో కాలుష్యం స్థాయి పెరుగుతోంది. అందుకే పంపా నది శుద్ధి కోసం శబరిమల ఆలయ అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
నది ప్రక్షాళనకు "మిషన్ స్వచ్ఛ్ శబరిమల" ప్రాజెక్ట్‌లో భాగంగా "గ్రీన్ గార్డ్స్"ను రంగంలోకి దింపింది. పచ్చటి ఏకరూపు దుస్తులు ధరించిన 24 మంది కార్మికులు... నదిలో భక్తులు విడిచిన వస్త్రాలు, ఇతర చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ఏరేస్తున్నారు.
పంపా నదితో పాటు శబరిమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేస్తోంది ఆలయ అధికార యంత్రాంగం.
ఇదీ చూడండి : నేడే కన్నడ 'ఉప' ఫలితాలు.. తేలనున్న యడియూరప్ప భవితవ్యం