సరోగసీ బిల్లును 23 సభ్యుల రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య పరమైన సరోగసీ విధానంపై నిషేధం విధించాలని ఈ బిల్లును ప్రతిపాదించింది ప్రభుత్వం.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానానికి ఆమోదం లభించింది.
అభ్యంతరాల నేపథ్యంలో..
లోక్సభలో ఆమోదం లభించిన సరోగసీ బిల్లుపై ఎగువ సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై పలువురు సభ్యులు సవరణలను ప్రతిపాదించారు. చట్టప్రకారం పెళ్లి అయి 5 ఏళ్లు గడిచిన వారికి.. వారి సమీప బంధువు దాతగా వ్యవహరించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల నిబంధననూ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు కేంద్ర మంత్రి.
ఈ బిల్లుపై వచ్చే సమావేశాల చివరి రోజు సెలక్ట్ కమిటీ తమ నివేదిక అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు హర్షవర్ధన్. అయితే కమిటీ ఛైర్మన్ ఎవరన్నదీ ఆయన ప్రకటించలేదు.
ఇదీ చూడండి:పార్లమెంటును తాకనున్న బ్యాంకుల విలీన వ్యతిరేక సెగ