ETV Bharat / bharat

ముంబయిలోని క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం - క్వారంటైన్ కేంద్రం అగ్ని ప్రమాదం ముంబయి

ముంబయిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇటీవలే క్వారంటైన్ కేంద్రంగా మార్చిన నాగ్‌పారా ప్రాంతంలోని రిప్పన్‌ హోటల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కరోనా బాధితులు ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.

mumbai quarantine centre fire
క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 21, 2020, 10:53 PM IST

ముంబయి నాగ్‌పారా ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. బెలసీస్‌ రోడ్డులో ఉన్న రిప్పన్‌ హోటల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. కొద్ది రోజుల క్రితమే ఈ హోటల్‌ను క్వారంటైన్‌ కేంద్రంగా మార్చి కరోనా బాధితులకు వసతి కల్పిస్తున్నారు.

సాయంత్రం 6:30 గంటల సమయంలో హోటల్‌లోని లాడ్జింగ్‌ రూంనుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం వల్ల ఆ పరిసరాల్లో పొగలు వ్యాపించాయి.

క్వారంటైన్‌లో ఉన్న బాధితులందరినీ అధికారులు రక్షించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.