ETV Bharat / bharat

పవార్​కు ఐటీ నోటీసులపై ఈసీ క్లారిటీ

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​కు నోటీసులు జారీ చేయాలని ఐటీ శాఖను ఆదేశించలేదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఐటీ శాఖ తమకు నోటీసులు ఇచ్చిందన్న పవార్​ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

EC-PAWAR
పవార్
author img

By

Published : Sep 23, 2020, 1:48 PM IST

ఎన్నికల అఫిడవిట్​కు సంబంధించి ఐటీ శాఖ తనకు నోటీసులు పంపిందని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ వెల్లడించిన నేపథ్యంలో ఈసీ స్పందించింది. పవార్​కు సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

"ఎన్నికల కమిషన్ ఆదేశించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మాకు నోటీసులు జారీ చేసింది" అని పవార్​ మంగళవారం తెలిపారు. తనతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, ఎంపీ సుప్రియా సూలే, మంత్రి ఆదిత్య ఠాక్రేకు ఈ నోటీసులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి: శరద్ పవార్​కు ఐటీ శాఖ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.