ETV Bharat / bharat

అమానుషం: చెత్త బండిలో మృతదేహం తరలింపు - పోలీసుల అమానవీయ చర్య

ఓ వ్యక్తి మృతదేహం పట్ల ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. శవపరీక్షలకు మృతదేహాన్ని మునిసిపాలటీ చెత్త బండిలో తరలించారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు వైరల్​ కావటంతో జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Dead body
చెత్త బండిలో మృతదేహం తరలింపు
author img

By

Published : Jun 12, 2020, 10:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌లోని బలరాంపుర్​ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మృతదేహాన్ని మునిసిపాలిటీ చెత్త వాహనంలో శవపరీక్షకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావటం వల్ల వెలుగులోకి వచ్చింది.

చెత్త బండిలో మృతదేహం తరలింపు

బలరాంపుర్ జిల్లా ఉత్రౌలా తహసీల్ కార్యాలయానికి వెళ్లిన అన్వర్ అలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో మృతదేహాన్ని చెత్త తీసుకెళ్లే వ్యానులో తరలించారు అక్కడి సిబ్బంది.

ఈ ఘటన ఒకరోజు తర్వాత మాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్​ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవప్రదమైన దహన సంస్కారాలు పౌరులకు దక్కే విషయమై సుమోటోగా విచారించాలని కోరారు. గౌరవంగా మృతదేహాల ఖననం జరగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

అసలేం జరిగింది?

ఉత్రౌలా చౌక్​లో మృతదేహం కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మృతదేహం ఆనవాళ్లను గుర్తించాల్సిందిగా సిబ్బందిని ఉత్రౌలా పోలీస్ స్టేషన్​ అధికారి ఆర్​కే రామన్​ ఆదేశించారు. చనిపోయిన వ్యక్తిని షాదుల్లానగర్​కు చెందిన అన్వర్​గా గుర్తించారు. అయితే అతని శవాన్ని మునిసిపల్ చెత్త బండిలో తరలించాలని అధికారులను రామన్ సూచించినట్లు తెలుస్తోంది​.

చర్యలు తీసుకుంటాం..

దీనిపై బలరాంపుర్​ ఎస్పీ దేవ్​ రంజన్​ను ఈ ఈటీవీ భారత్​ వివరణ కోరగా.. ఘటనపై దర్యాప్తునకు అదేశించినట్లు తెలిపారు.

"సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయిన వీడియో చూసిన తర్వాత ఈ విషయం నా దృష్టికి వచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్​తో దీనిపై చర్చించాం. ఈ దారుణమైన ఘటనతో సంబంధం ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. వారు తప్పక మూల్యం చెల్లిస్తారు. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో ఖననానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలని సంబంధిత ఆధికారులకు నిర్దేశించాం."

- దేవ్​ రంజన్ వర్మ, బలరాంపుర్​ ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.