ETV Bharat / bharat

'మహా' సర్కార్​లో భగ్గుమన్న విభేదాలు - కాంగ్రెస్​ తాజా వార్తలు

మహారాష్ట్రలోని మహావికాస్​ ఆఘాడీ సర్కాలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఔరంగాబాద్​ను సంభాజీనగర్​గా పేరు మార్చాలన్న శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్​ మంత్రి బాలాసాహెబ్​ థోరట్​ వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్​ వైఖరి.. కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపదని శివసేన 'సామ్నా'లో పేర్కొంది.

congress oppose shivasena decision on change of Aurangabad name
మహా' సర్కార్​లో లుకలుకలు
author img

By

Published : Jan 3, 2021, 7:58 AM IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్​ను సంభాజీనగర్​గా పేరు మార్చే ప్రతిపాదనను కాంగ్రెస్​ గట్టిగా వ్యతిరేకిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలాసాహెబ్​ థోరట్​ శనివారం పునరుద్ఘాటించారు. త్వరలోనే ఔరంగాబాద్​ పేరు మార్పు జరుగుతుందని శివసేన స్పష్టం చేసినప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేరు మార్పు ప్రతిపాదన, విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించకూడదని థోరట్​ చెప్పారు. ఇదే విషయమై ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్​ ప్రభావం చూపలేదు

దీనిపై శివసేన స్పందించింది. కాంగ్రెస్​ వైఖరి.. మహా వికాస్​ ఆఘాడీ(ఎమ్​వీఏ) ప్రభుత్వంపై ప్రభావం చూపబోదని తన పత్రిక 'సామ్నా' లో శనివారం ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్​ తిరస్కరణ.. ప్రతిపక్ష భాజపాను సంతోష పెట్టిందని పేర్కొంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్​, శివసేన, ఎన్​సీపీ.. కూర్చొని చర్చిస్తే సమస్య పరిష్కారమవుతుందని అందులో తెలిపింది.

ఆయనే మార్చారు..ఖరారు చేయాల్సిందే

30 ఏళ్ల కిందటే బాలాసాహెబ్​ ఠాక్రే.. ఔరంగాబాద్​ను సంభాజీనగర్​గా మార్చారని, దాన్ని అధికారికంగా పూర్తి చేయాల్సి ఉందని శివసేన పేర్కొంది. ఔరంగాబాద్​ పేరును సంభాజీనగర్​గా జనవరి 26లోగా మార్చాలని నవ నిర్మాణ సేన( ఎమ్​ఎన్​ఎస్​) కార్యకర్తలు నాశిక్​లో డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఎన్నికల్లో యువతకు అవకాశాలేవీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.