ETV Bharat / bharat

24న రాష్ట్రపతిని కలవనున్న రాహుల్​ బృందం

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన 2 కోట్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. రాహుల్​ అధ్యక్షతను డిసెంబర్​ 24న రామ్​నాథ్​ కోవింద్​ను కలవనున్నట్లు తెలిపింది.

congress-delegation-to-meet-president-demanding-withdrawal-of-farm-laws
సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి జోక్యం కోరనున్న కాంగ్రెస్​
author img

By

Published : Dec 23, 2020, 6:03 AM IST

Updated : Dec 23, 2020, 11:44 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనుంది రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం. డిసెంబర్​ 24న కలిసి.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్​ అధ్యక్షతన కాంగ్రెస్​ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఓ ప్రకటన విడుదల చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర వేదన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్​ నుంచి కాంగ్రెస్​ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది.

''లక్షలాది రైతులు అంతటి శీతల వాతావరణ పరిస్థితుల్లో.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తెచ్చింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను దిల్లీ రాకుండా అడ్డుకుంటున్నారు.''

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ​ ప్రధాన కార్యదర్శి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని, ఇప్పటికే 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కమ్ముకొస్తున్న డ్రాగన్​- భారత్​ పరిస్థితి ఏంటి?

Last Updated : Dec 23, 2020, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.