ETV Bharat / bharat

'ఫేస్​బుక్​ ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు' - Facebook in India

ఫేస్​బుక్​పై చెలరేగిన రాజకీయ దుమారం తీవ్ర రూపం దాల్చుతోంది. ఫేస్​బుక్​ వివాదంపై దర్యాప్తునకు డిమాండ్​ చేసింది కాంగ్రెస్​. అధికార భాజపాకు అనుకూలంగా వ్యవహరించినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని కోరింది. ఇదే సమయంలో ఫేస్​బుక్​ అధినేత మార్క్​ జుకర్​బర్గ్​కు లేఖ రాశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఫేస్​బుక్​ ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

Cong demands criminal
'ఫేస్​బుక్​ ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు'
author img

By

Published : Sep 2, 2020, 5:10 AM IST

Updated : Sep 2, 2020, 6:21 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​పై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మరోమారు ఆరోపించింది కాంగ్రెస్​. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేసింది. భారత ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యంపై ఫేస్​బుక్​ చేసిన దాడిని అంతర్జాతీయ మీడియా బహిర్గతం చేసిందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. వాల్​స్ట్రీట్​ జర్నల్​లో వచ్చిన కథనాన్ని జత చేశారు రాహుల్​.

దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఒక విదేశీ సంస్థను అనుమతించేది లేదు. వారిపై తక్షణం దర్యాప్తు చేపట్టాలి. తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాల్సిందే.

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ప్రధాని మోదీ, భాజపా సోషల్​ మీడియా ప్రచారాలపై ఫేస్​బుక్​, వాట్సాప్​లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది కాంగ్రెస్​. ఈ విషయాన్ని విదేశీ మీడియాలు బహిర్గతం చేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ వ్యతిరేక శక్తులు..

ఫేస్​బుక్​ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్​ జుకర్​బర్గ్​కు మూడు పేజీల లేఖ రాశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన కొందరు ప్రధాని మోదీ, కేబినేట్​ మంత్రులపై దూషిస్తున్న వారికి సంస్థ ఉద్యోగులు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఫేసుబుక్​ ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మద్దతుదారుల ఫిర్యాదులపై కావాలనే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ఆసక్తులు, అనాసక్తులు తటస్థ ప్రజావేదికగా ఉండాల్సిన ఫేస్​బుక్​ వంటి సంస్థల విశ్వసనీయతపై ప్రభావం చూపరాదని తెలిపారు.

వరుస ఓటములపాలైన శక్తులు సామాజిక మాధ్యమ వేదికల్లోని విధాన నిర్ణాయక విభాగాల్లో తమకున్న ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు అప్రతిష్ఠ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి. కోట్ల మంది ప్రజల భావ ప్రకటన హక్కును రాజకీయ పక్షపాతంతో కొందరు నొక్కివేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.

రవిశంకర్​ ప్రసాద్​ లేఖపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఫేస్​బుక్​-భాజపా సంబంధాలు బహిర్గతమవుతాయనే కారణంతో పక్షపాతం వహించిన వారిని రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంలో జేపీసీ దర్యాప్తునకు మోదీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించటం లేదని ప్రశ్నించారు.

పార్లమెంటరీ ప్యానల్​ భేటీ..

ఫేస్​బుక్​ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంటరీ ప్యానల్​ బుధవారం భేటీ కానుంది. కాంగ్రెస్​ నేత శశి థరూర్​ నేతృత్వంలోని ఐటీ విభాగం పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ఫేస్​బుక్​ ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. పౌర హక్కుల పరిరక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని కట్టడి చేయటం, డిజిటల్​ విభాగంలో మహిళల భద్రత వంటి అంశాలపై వారి వాదనలు విననుంది కమిటీ. ఇదే అంశంపై ఎలక్ట్రానిక్స్​, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ?

Last Updated : Sep 2, 2020, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.