ETV Bharat / bharat

ప్రియాంకను తనతో పాటు రమ్మన్న మదర్ థెరిసా!

author img

By

Published : Aug 26, 2020, 6:21 PM IST

మదర్ థెరిసా సేవలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత తనతో పాటు వచ్చి పనిచేయాలని థెరిసా కోరినట్లు తెలిపారు.

'Come and work with me': Mother Teresa told Priyanka after Rajiv's assassination
ప్రియాంకా గాంధీ

మదర్ థెరిసా 110వ జయంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య అనంతరం థెరిసా తమను కలిసినట్లు చెప్పారు. ఆ సందర్భంగా తనతో కలిసి పనిచేసేందుకు రావాలని థెరిసా పిలుపునిచ్చినట్లు ప్రియాంక వెల్లడించారు.

ఛారిటీ సభ్యులతో కలిసి రోగులకు సాయం చేస్తున్నప్పటి పాత ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేస్తూ ఈ విషయం చెప్పారు ప్రియాంక.

  • Shortly after my father was killed #MotherTeresa came to see us. I had fever. She sat by my bedside, held my hand and said ‘Come and work with me’. I did so for many years, and owe her a great debt of gratitude for the abiding friendship of all the MC sisters..1/2 pic.twitter.com/sEk3mK2oqb

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మా నాన్న చనిపోయిన కొద్దిరోజుల తర్వాత మదర్ థెరిసా మమ్మల్ని చూడటానికి వచ్చారు. అప్పుడు నాకు జ్వరం వచ్చింది. ఆమె నా పక్కన కూర్చొని చేయి పట్టుకొని తనతో పాటు రావాలని పిలిచారు. తర్వాత చాలా సంవత్సరాలు సేవ చేశాను. నిస్వార్థ సేవ, ఆప్యాయతలు చూపిస్తున్న ఛారిటీ సిస్టర్స్​లో గొప్ప స్నేహభావాన్ని చాటిన థెరిసాకు కృతజ్ఞతలు."

-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

మదర్ థెరిసా జయంతి సందర్భంగా కోల్​కతాలోని 'మదర్​ హౌస్'(మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం)​లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రజలను అనుమతించలేదు.

1910 ఆగస్టు 26న అల్బేనియన్ కుటుంబంలో జన్మించారు థెరిసా. చిన్న వయసులోనే ఇల్లు వదిలి భారత్​కు వచ్చారు. 1950లో పేదలకు సేవ చేసేందుకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని ప్రారంభించారు.

1997 సెప్టెంబర్ 5న థెరిసా తుది శ్వాస విడిచారు. 2016 సెప్టెంబర్ 4న థెరిసాను 'సెయింట్​'గా ప్రకటించారు.

ఇదీ చదవండి- 'కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎన్​95 భేష్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.