కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి గ్రామంలో ఓ చిరుతపులి కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో సాయినగర్‌లోని ఓ ఇటుకల బట్టీ వద్దకు వచ్చిన పులి, ఓ కుక్క పిల్లపై దాడి చేసి పట్టుపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఈ ఘటనతో ఆందోళన చెందిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రూర మృగాలు గ్రామంలో ప్రవేశిస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: కాశీలో మాజీ జవాను నామినేషన్ తిరస్కరణ