ETV Bharat / bharat

తల లేని మృతదేహం గుర్తింపు- హత్యాచారమేనా? - jirabar forest area news

ఝార్ఖండ్​లో దారుణం జరిగింది. శిరచ్ఛేదం చేసిన ఓ యువతి మృతదేహాన్ని రాంచీ పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

beheaded body of woman found in ranchi rape suspected
తల లేని మృతదేహం గుర్తింపు.. హత్యాచారమేనా?
author img

By

Published : Jan 4, 2021, 2:11 PM IST

శిరచ్ఛేదం చేసిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు ఝార్ఖండ్​లోని రాంచీ పోలీసులు. ఓర్మాంఝీ పీఎస్​ పరిధిలోని జిరాబర్​ అటవీ ప్రాంతంలో శవం లభ్యమైనట్లు తెలిపారు.

20-30 ఏళ్ల మధ్య వయసున్న ఆ యువతిని ఎక్కడో చంపి ఇక్కడ పడేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

తల లేని యువతి మృతదేహాన్ని గుర్తించాం. ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేశారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాం. శవపరీక్ష అనంతరం అమ్మాయిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుంది. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించాం. ఆమె ఎవరనే విషయం తెలుసుకోవడానికీ ప్రయత్నాలు ముమ్మరం చేశాము. డాగ్ స్క్వాడ్​నూ పిలిపించాం. కేసు త్వరలోనే ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది.

-నౌషద్​ ఆలాం, పోలీసు అధికారి

గత కొద్ది రోజులుగా వచ్చిన మిస్సింగ్ కేసులు సహా సెల్​ఫోన్​ సిగ్నల్స్​ను నిశితంగా పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మూడేళ్ల పాప లాకప్​ డెత్​పై నిరసన జ్వాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.