ETV Bharat / bharat

ఎలుగుబంటితో 75ఏళ్ల వృద్ధుడి ఫైట్.. 15నిమిషాలు పోరాడి, తీవ్ర గాయాలతో 2కి.మీ నడిచి.. - కర్ణాటకలో ఎలుగుబంటి దాడులు

Old Man Fight With Bear : కర్ణాటకలో 72 ఏళ్ల వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. దానితో 15 నిమిషాలపాటు ధైర్యంగా పోరాడిన ఆ వృద్ధుడు.. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు.

bear-attack-on-old-man-75-year-old-man-survived-with-injuries-in-karnataka
ఎలుగుబంటితో 75 ఏళ్ల వృద్ధుడి యుద్ధం
author img

By

Published : Jun 23, 2023, 4:03 PM IST

Old Man Fight With Bear : ఎలుగుబంటితో ప్రాణాలకు తెగించి పోరాడాడు ఓ 72 ఏళ్ల వృద్ధుడు. 15 నిమిషాల పాటు దానితో భీకర యుద్ధం చేసి.. ఎట్టకేలకు బతికి బట్టకట్టాడు. అటవీ మార్గంలో ఒంటరిగా వెళుతున్న విఠల్​ అనే వృద్ధుడిపై.. అకస్మాత్తుగా ఈ ఎలుగుబంటి దాడి చేసింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..
జోయిడా తాలూకాలోని జగల్ పేటన తింబలిలో వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడు​ మాలోర్గి గ్రామానికి చెందిన వ్యక్తి. శుక్రవారం విఠల్ అటవీ మార్గంలో వెళుతుండగా.. ఎలుగుబంటి దాడి చేసింది. అనంతరం అప్రమత్తమైన విఠల్.. దానిపై ఎదురుదాడికి దిగి, ప్రాణాలకు తెగించి పోరాడాడు. తన బలం మొత్తాన్ని కూడగట్టుకుని 15 నిమిషాల పాటు ఎలుగుబంటిని ఎదిరించిన ఆ వృద్ధుడు.. చివర్లో గట్టిగా అరిచాడు. దీంతో ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది.

విఠల్​కు తీవ్ర గాయాలు..
ఎలుగుబంటి దాడిలో విఠల్​ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిలో అతడికి ఓ కన్నుపోయింది. మరో కన్నుకు కూడా తీవ్రంగా గాయమైంది. శరీరానికి, తలకు చాలా గాయాలయ్యాయి. అయినా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ.. బంధువుల ఇంటికి చేరాడు విఠల్​. వృద్ధుడి పరిస్థితిని గమనించిన బంధువులు.. జరిగింది తెలుసుకుని అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. మొదట రామ్​నగర్​ హాస్పిటల్​లో చేర్పించారు. పరిస్థితి విషమించిన కారణంగా బెళగావి ఆసుపత్రికి తరలించారు.

రెండు, మూడు రోజులు చికిత్స అవసరమన్న వైద్యులు..
ప్రస్తుతం విఠల్​ ​ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అతను చికిత్సకు సహకరిస్తున్నాడని వెల్లడించారు. వృద్ధుడికి రెండు నుంచి మూడు రోజుల చికిత్స అవసరమని.. అనంతరం డిశ్చార్జ్​ చేస్తామని వారు పేర్కొన్నారు.

చిరుతతో 65 ఏళ్ల వృద్ధుడి యుద్ధం..
కొద్ది రోజుల క్రితం బంగాల్​లో ఓ 65 ఏళ్ల వ్యక్తి.. ఇలాగే ఓ చిరుతను ఎదిరించాడు. దానితో భీకరంగా పోరాడాడు. చిరుత విసిరిన పంజాను ఎదుర్కొని.. ప్రాణాలతో నిలబడ్డాడు. ఆరు పదులో వయసులో పులితో పోరాడి.. అనంతరం ఆసుపత్రి పాలయ్యాడు. బహదుర్ రాయ్ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బిడ్డ కోసం హైనాతో పోరాటం.. 3 కి.మీ పరిగెత్తిన తల్లి.. దురదృష్టవశాత్తూ..
ఛత్తీస్​గఢ్​లోనూ ఇలాంటి ఘటనే ఒకటి.. నెల రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల చిన్నారి ఆరుబయట ఆడుకుంటూ ఉండగా ఓ హైనా వచ్చి బాలుడిని ఎత్తుకెళ్లింది. దానిని గమనించిన తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా హైనా వెంట 3కిలోమీటర్లు పరిగెత్తి కుమారుడిని వన్యప్రాణి నుంచి కాపాడుకుంది. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగ్​దల్​పుర్ జిల్లా చిత్రకోట్ అటవీ ప్రాంతంలో జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.