ఓ మండపంలో పెళ్లి వేడుక జరుగుతోంది. వివాహానికి వచ్చిన బంధువులతో సందడి వాతారణం నెలకొంది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె నగల బ్యాగ్ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇంతలో కనిపించకుండా పోయిన నగల బ్యాగ్‌తో ఓ ఆటో డ్రైవర్ మండపంలోకి వచ్చాడు. దీంతో అందరి ముఖాలపై చిరునవ్వు పూసింది.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లా హల్ద్వానీ ఓ పెళ్లి వేడుక జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులందరూ ఆటోలో ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. ఆటో దిగి, నగల బ్యాగ్‌ను అందులోనే మరచిపోయారు. ఆ బ్యాగ్‌లో రూ. 6 లక్షలు విలువైన నగలతో పాటు రూ.50 వేల నగదు కూడా ఉంది. అనంతరం నగల బ్యాగ్ గురించి వెతకగా అది దొరకలేదు. దీంతో అప్పటివరకు కోలాహలంగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది.
ఆటోలో మరచిపోయిన బ్యాగ్‌ను గమనించకుండా.. డైవర్ తన ఇంటికెళ్లాడు. అనంతరం ఆటోలో సంచిని గమనించాడు. దాదాపు రెండు గంటల తర్వాత.. కల్యాణ మండపానికి వచ్చి, బ్యాగ్‌ను పెళ్లి కుమార్తె బంధువులకు అందజేశాడు. అందరూ కృతజ్ఞతతో ఆటో డ్రైవర్ వల్లభ్ జోషిపై ప్రశంసల వర్షం కురిపించారు. పూలమాల వేసి సత్కరించారు. అతడి నిజాయితీ మెచ్చి నగదు ఇవ్వగా.. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు వల్లభ్ జోషి.
ఇవీ చదవండి : లంబోర్గినిగా మారిన మారుతీ స్విఫ్ట్ సీఎంకు మెకానిక్ కానుక
ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం.. గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి