Fire accident in Delhi: దిల్లీ రోహిణి సెక్టార్ 7లో అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 21 మంది విద్యార్థులు ఉన్నారు. మంటలు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు సైతం అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:05 గంటల సమయంలో జరిగిందని.. డ్రైవర్ సహా పిల్లలందరినీ రక్షించామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ఊళ్లో కొత్త బస్టాండ్ నిర్మాణం- ఓపెన్ చేసిన 'గేదె'!
నడిరోడ్డుపై 'లిప్ లాక్ ఛాలెంజ్'.. ప్రముఖ కాలేజీ విద్యార్థుల రచ్చ!