ETV Bharat / bharat

పట్టాలకు అడ్డుగా చెట్టు.. ఎర్రటి వస్త్రంతో ట్రైన్​ను ఆపిన వృద్ధురాలు.. వందలాది మంది సేఫ్​! - కర్ణాటకలో రైలు ప్రమాదం ఆపిన మహిళ

కర్ణాటకలోని ఓ వృద్ధురాలు చాకచక్యంగా వ్యవహరించి రైలు ప్రమాదం జరగకుండా చూసింది. దీంతో రైలులో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే?

70 year old woman saved several lives in karnataka
కర్ణాటకలో రైలు ప్రమాదాన్ని ఆపిన 70 ఏళ్ల వృద్ధురాలు
author img

By

Published : Apr 5, 2023, 10:52 AM IST

కర్ణాటకలోని ఓ వృద్ధురాలు రైలు ప్రమాదాన్ని అడ్డుకుంది. తన అనారోగ్యాన్ని సైతం లెక్కజేయకుండా రైలు పట్టాల వైపు పరుగెత్తికెళ్లింది. రైల్వే ట్రాక్​పై చెట్టు పడి ఉందని లోకో పైలట్​కు తెలియజేసింది. దీంతో అప్రమత్తమై లోకో పైలట్​ రైలును ఆపారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందరో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వృద్దురాలి సాహసం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఆ వృద్దురాలు ఎవరంటే?

మందారా నగరంలో చంద్రావతి( 70) అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఈమెకు గుండెకు సంబంధించి శస్త్రచికిత్స కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ క్రమంలో గతనెల 21న మధ్యాహ్నం 2:10 నిమిషాల ప్రాంతంలో ఓ రైలు రావడాన్ని తన ఇంటి నుంచి గమనించింది చంద్రావతి. అయితే అదే సమయంలో రైలు వస్తున్న ట్రాక్​పై ఓ భారీ చెట్టు పడి ఉండడాన్ని గుర్తించారు చంద్రావతి. వెంటనే తన ఇంట్లోని ఎవరికైనా సమాచారం అందించేందుకు చూశారు. కానీ, ఇంట్లో ఎవరూ కనిపించకపోవడం వల్ల ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని రైలు వస్తున్న పట్టాల వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. పట్టాలకు ఓ పక్క నిలబడి వెంట తెచ్చిన ఎర్రటి వస్త్రాన్ని రైలు లోకో పైలట్​ డ్రైవర్​​కు కనిపించేలా ఊపారు. ఇది గమనించిన లోకో పైలట్​ వెంటనే చెట్టు పడి ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో రైలును ఆపారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించడం వల్ల రైల్వే ట్రాక్​పై పడి ఉన్న చెట్టును స్థానికుల సహాయంతో తొలిగించారు.

70 year old woman saved several lives in karnataka
వృద్ధురాలు చంద్రావతి

ఆపరేషన్​ జరిగింది.. అయినా వెళ్లింది!
ఈ ఘటన పాడిల్​, జోకట్టె స్టేషన్ల మధ్య ఉన్న పట్టాలపై జరిగిందని.. ఈ రైలు మంగళూరు నుంచి ముంబయి వెళ్లే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్‌ అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయం కాస్త రైల్వే పోలీసుల దృష్టికి చేరడం వల్ల మంగళవారం చంద్రావతిని కార్యాలయానికి పిలిచి సత్కరించారు. ఇటీవలే చంద్రావతికి గుండె సంబంధిత ఆపరేషన్​ కూడా జరిగిందని.. అయినా ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సాహసం చేశారంటూ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు.

"రైలు ప్రమాదం జరగబోతోందని చూసిన వెంటనే ఇంట్లోని ఎవరికైనా సమాచారం ఇద్దామని వెళ్లాను. కానీ, అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. అప్పటికే రైలు హారన్​ శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా నేనే ఇంట్లో నుంచి ఓ ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని పట్టాలపైకి వెళ్లాను. పక్కన నిలబడి దానిని లోకోపైలట్​కు కనబడేలా ఊపాను. అది చూసిన లోకో పైలట్​ వెంటనే రైలును చెట్టు పడి ఉన్న కొద్ది దూరంలోనే ఆపేశారు.

--చంద్రావతి, వృద్ధురాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.