ETV Bharat / bharat

Live Updates : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్​పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 10:10 AM IST

Updated : Sep 19, 2023, 5:33 PM IST

Protest_Against_CBN_Arrest
Protest_Against_CBN_Arrest

17:24 September 19

16:06 September 19

ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన వాదనలు..

  • చంద్రబాబు క్వాష్‌ కేసులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా
  • ఉదయం నుంచి కోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు
  • చంద్రబాబు క్వాష్‌ కేసులో సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరుపక్షాలు
  • మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు సాగిన వాదనలు
  • రంజిత్‌కుమార్‌
  • అర్నాబ్‌ గోస్వామి కేసు తీర్పును నిహారిక కేసులో పరిగణలోకి తీసుకోలేదు..
  • ఈ విషయం బెంచ్‌కు తెలియకుండా ఉంటుందని నేను అనుకోను..
  • శుక్రవారంలోపు కౌంటర్‌ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన రంజిత్‌కుమార్
  • హరీశ్‌సాల్వే
  • ప్రభుత్వ తరఫు వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.. ఒకసారి దర్యాప్తు ప్రారంభ దశలో ఉందంటారు..
  • ఒకసారి దర్యాప్తు 2018లోనే ప్రారంభమైందంటారు
  • నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్లు కనబడట్లేదంటారు
  • కేసుకు సంబంధించిన ఫైళ్లను ధ్వంసం చేసి పిటిషనర్‌పై నిందారోపణలు చేస్తున్నారు
  • లూథ్రా
  • ఏఏజీ వాదనలు.. ఒక వ్యక్తి స్వేచ్ఛ పట్ల ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి
  • నేను 2021లో నమోదైన ఫిర్యాదు గురించే మాట్లాడుతున్నాను
  • ఆ ఫిర్యాదుపైనే వాదనలు వినిపిస్తున్నా.. 2021లో ఫిర్యాదు నమోదైంది..
  • కేసులో అన్ని పరిణామాలు ఆ తర్వాతే జరిగాయి
  • ఇప్పుడు 2018 ప్రస్తావన ఎందుకు?
  • బెంచ్‌
  • చెప్పాల్సింది ఉంటే ఇప్పుడే చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు సూచించిన కోర్టు
  • రోజంతా విన్నాం.. ఈ కేసును తేల్చేస్తాం అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు చెప్పిన కోర్టు
  • లూథ్రా
  • ఏపీ ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం పత్రాలు కనబడకుండా పోతున్నాయి
  • ఈ కేసులో ఛైర్మన్ ఏ1 అయి ఉండి.. ఏ1 నిధులు విడుదల చేశారంటున్నారు
  • అది ఏ37 సూచనల మేరకు చేశారన్నది మీ ఆరోపణ
  • మీరు చెప్పిన వాదనల ప్రకారమే ఈ ఆరోపణలకు 17ఏ ఎందుకు వర్తించదు
  • కేసు వాదన సందర్భంగా రఫేల్‌ కేసులో జస్టిస్‌ జోసెఫ్‌ అభిప్రాయాన్ని ప్రస్తావించిన లూథ్రా
  • రఫేల్‌ కేసులోనూ కచ్చితంగా ఇలాగే జరిగింది
  • కోర్టు
  • ఇరువైపులా వాదనలు విన్నాం.. నిర్ణయం తీసుకుంటాం చెప్పిన కోర్టు
  • ముకుల్‌ రోహత్గీ
  • చంద్రబాబును 7న నిందితుడిగా పేర్కొన్నారు.. 9న అరెస్టు చేశారు:
  • 12న క్వాష్‌ పిటిషన్‌ వేశారు.. ఇవాళ 19వ తేదీ.. కేవలం పది రోజులే
  • కేసు దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది.. ఈ కేసును ఇప్పుడే తీసుకోవద్దని మనవి
  • దర్యాప్తు ప్రారంభమైంది ఇప్పుడే.. పిటిషనర్‌ తరఫున 900 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు
  • ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును విచారణకు తీసుకోవద్దు
  • ఇంత లోతైన కేసును పది రోజుల్లో దర్యాప్తు చేయడం సాధ్యం కాదు
  • ఇప్పటికే పిటిషనర్‌ బెయిల్‌ కూడా దరఖాస్తు చేశారు
  • నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది
  • నిధుల దుర్వినియోగం కేసులో 17ఏ వర్తించదు
  • పథకం ప్రకారం రూ.370 కోట్ల కుంభకోణం జరిగింది
  • ప్రభుత్వ నిధులను దోచుకోవడాన్ని ప్రజా సేవ అనలేము
  • సివిల్‌ సర్వీసు అధికారి సంతకం చేసినందున దీన్ని స్కామ్‌ అనకుండా ఉండలేము
  • ఈ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.. పన్నుల శాఖ, పీఎంఎల్‌ఏ దర్యాప్తు జరుగుతోంది
  • ప్రాజెక్టు కట్టాం.. వరదకు కొట్టుకుపోయింది.. ప్రాజెక్టు నిర్మాణంలో మాకు దురుద్దేశం లేదన్నట్లుగా డిఫెన్సు వాదన ఉంది
  • 17ఏ అన్నది అమాయకులైన ప్రజా సేవకులను కాపాడేందుకు తెచ్చింది
  • 2018కి ముందే ఈ కేసులు సంబంధించి మూలాలు ఉన్నాయి.. కాబట్టి 2018 చట్టసవరణ వర్తించదు
  • 2021లో అనుమతి తీసుకున్నాం.. 2018కి ముందు కేసు కావున అనుమతి తీసుకోవాలనే నిబంధన వర్తించదు
  • ఇది కుట్రపూరితంగా.. పథకం ప్రకారంగా చేసింది .. అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికార కేంద్రం నుంచి ఈ కుట్రకు పథకం వేశారు
  • వాదనల సందర్భంగా శంభునాథ్‌ మిశ్రా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేసులను ఉదహరించిన ముకుల్‌ రోహత్గీ
  • పోలీసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు కేసు మంచి చెడులకు కోర్టులు వెళ్లరాదు
  • దర్యాప్తు పూర్తిచేసే అవకాశం పోలీసులకు కల్పించాలి
  • ఇప్పటికి ఉన్న సాక్ష్యాల ఆధారంగా కేసు విషయంలో నిర్ణయానికి రాలేము
  • అతి అరుదైన కేసుల్లో నేరపూరితమైన ఆరోపణలు లేనప్పుడే కోర్టులు కేసును కొట్టివేయగలవు
  • దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది.. ఐటీ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి
  • కేసు దర్యాప్తు తొలి దశలోనే కోర్టులు కేసును కొట్టివేయలేవు
  • ఈ కేసుపై ఎంతసేపటికీ నేను మాజీ సీఎంను కాబట్టి ఇది రాజకీయం అని మాత్రమే వాదిస్తున్నారు
  • ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే సంపూర్ణమైన కేసు డాక్యుమెంట్ కాదు.. దర్యాప్తు క్రమంలో ఇతర నిందితులను చేర్చవచ్చు
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా పనిచేస్తోంది
  • కేసు దర్యాప్తు ప్రారంభమైన 2021లోనే మాజీ సీఎం చేర్చలేదు
  • తగినన్ని ఆధారాలు లభించిన తర్వాతే మాజీ సీఎం పేరు చేర్చారు
  • అర్నాబ్‌ గోస్వామి కేసును ఈ కేసులో పరిగణలోకి తీసుకోలేము
  • అర్నాబ్‌ గోస్వామి కేసు వాక్‌ స్వాతంత్ర్యానికి సంబంధించింది
  • మాజీ సీఎం కేసు నిధుల దుర్వినియోగానికి సంబంధించింది
  • ఇరువురి వృత్తులు పూర్తిగా భిన్నమైనవి.. కాబట్టి రెండింటినీ పోల్చలేము
  • రెండు కంపెనీలు, ప్రభుత్వ సంస్థ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం
  • ప్రైవేటు సంస్థ సిద్ధం కాకుండానే రూ.300 కోట్లు బదిలీ చేశారు
  • రెండు ప్రైవేటు కంపెనీలు మరో 2 కంపెనీలను ఏర్పాటు చేసి ఆ రెండు కంపెనీలు 6 షెల్‌ కంపెనీలకు నిధులు బదిలీ చేశాయి
  • ప్రభుత్వాలు ముందుగా సొమ్ము చెల్లించవు.. ఇది తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంది
  • ప్రభుత్వం ప్రతీకార ఇచ్ఛతో ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేసి ఉండేది
  • ఎంవోయూ, సబ్‌ కాంట్రాక్టుల గురించి మాట్లాడట్లేదు.. ఈ ఒప్పందంలోని కంపెనీలన్నీ షెల్‌ కంపెనీలే
  • ఎలాంటి సేవలు అందించకుండానే ఈ కంపెనీలు డబ్బులు తీసుకున్నాయి: ముకుల్‌ రోహత్గీ
  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన క్రమం ఇది
  • సబ్‌ కాంట్రాక్టులను ఎవరు నియమించారని ప్రశ్నించిన బెంచ్‌
  • సబ్‌ కాంట్రాక్టర్‌ ఎంపికలో పిటిషనర్‌ పాత్ర ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన బెంచ్‌

  • రంజిత్‌కుమార్‌
  • పిటిషనర్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.. ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇదే తరహా లావాదేవీలు జరిగి ఉండవచ్చు: రంజిత్‌కుమార్‌
  • అన్ని కేసుల్లోనూ నేరపూరిత ప్రక్రియ ఇలాగే ఉండవచ్చు: రంజిత్‌కుమార్‌
  • లావాదేవీల ప్రక్రియపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిగింది: రంజిత్‌కుమార్‌
  • డిజైన్‌టెక్‌ రూ.200 కోట్లు మళ్లించినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రిపోర్టు వచ్చింది
  • ఒప్పందం జరిగిన నెల రోజుల తర్వాత స్కిల్లార్‌ కంపెనీ ఏర్పాటైంది
  • రూ.178 కోట్ల విలువైన వస్తువులను స్కిల్లార్‌ నుంచి డిజైన్‌టెక్‌ కొన్నట్లు చూపిస్తోంది
  • ఈ ప్రతిపాదనలు, ఒప్పంద పత్రాలపై ఎక్కడా తేదీలు లేవు
  • జీవోలు, ఒప్పందం ఏకరూపకంగా లేవు
  • పిటిషనర్‌ తన 161 స్టేట్‌మెంట్‌లో కేవలం సంతకాల కోసం తన వద్దకు వచ్చినట్లు చెప్పారు
  • ఒప్పందం మొత్తంలో జరగాల్సింది జరగలేదు
  • కేసు డైరీ ప్రకారం ఇవి 2015-16లో జరిగిన లావాదేవీలు.. కాబట్టి 2018 సవరణ చట్టం వర్తించదు
  • ఈ సందర్భంగా ప్రీతి షరాఫ్‌, స్టేట్‌ ఆఫ్‌ ఎన్‌సీటీ దిల్లీ కేసును ఉదహరించిన రంజిత్‌కుమార్‌
  • హరీశ్‌ సాల్వే
  • ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదన ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంది
  • ప్రాసిక్యూషన్‌ వాదన ప్రకారం మాజీ సీఎం ఆర్డర్‌ పాస్‌ చేసి సొంత మనుషులను ఛైర్మన్లుగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు
  • మాజీ సీఎం బేరసారాలు జరిపి నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.. ఈ వాదనే అసంబద్ధం, అర్థం లేనిది
  • 2018తర్వాత నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లకు 17ఏ వర్తిస్తుంది.. ప్రొసీజర్‌ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు
  • ఎఫ్‌ఐఆర్‌ చదివితే ఒక్క ఆరోపణ కూడా కనిపించట్లేదు
  • ఒక వ్యక్తిని అణచివేసేందుకు రాజ్యం తన శక్తిని వినియోగించకూడదు
  • ప్రాసిక్యూషన్‌ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి.. ఒకటి అడుగుతుంటే మరోటి చెబుతున్నారు
  • ప్రభుత్వ న్యాయవాది వాదన.. చీకట్లో వెతుకుతున్నట్లుగా ఉంది
  • కేంద్ర ప్రభుత్వ సంస్థలు మదింపు చేసి నిర్ధారించాయి.. రాష్ట్రమేమో స్క్రూడ్రైవర్ల ధర ఎంతో కనుక్కునే ప్రయత్నం కనిపిస్తోంది
  • ఆరు ప్రభుత్వ సంస్థలు కేసు వెనుకపడి అనవసర ప్రయాస పడుతున్నారు
  • ఒప్పందంలో ప్రైవేటు సంస్థలు ఒక్క రూపాయి నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు.. 90 శాతం వాళ్ల భాగం విజయవంతంగా పూర్తిచేశారు
  • పన్నులను తగ్గించుకునేందుకు డిజైన్‌టెక్‌ ప్రయత్నం చేసినట్లు ఉంది.. అక్కడే అసలు సమస్య ప్రారంభమైనట్లు ఉంది
  • పిటిషనర్‌ను ఈ కేసులో భాగస్వామ్యం చేయడం దురుద్దేశపూర్వక చర్య
  • ఇది 2024 ఎన్నికల రాజకీయ రణక్షేత్రమే
  • ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే అదే స్పష్టమవుతోంది

15:17 September 19

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు
  • సీఆర్‌పీసీ 17ఏపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ముకుల్ రోహత్గీ
  • గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసును ఉదహరించిన ముకుల్‌ రోహత్గీ
  • చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పును ఉదహరించిన ముకుల్ రోహత్గీ
  • ఈ దశలో నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకూడదు: రోహత్గీ
  • ఎఫ్ఐఆర్ ఎన్‌సైక్లోపీడియా కాదు: న్యాయవాది ముకుల్‌ రోహత్గీ

15:08 September 19

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కర్ణాటకలో కొనసాగుతున్న ఆందోళనలు

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కర్ణాటకలో కొనసాగుతున్న ఆందోళనలు
  • బెంగళూరులో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు
  • కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరసనలు
  • కర్ణాటక: సింధనూరులో భారీగా తరలివచ్చి నిరసన తెలిపిన ప్రజలు
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు

14:41 September 19

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు మళ్లీ ప్రారంభం

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు మళ్లీ ప్రారంభం
  • ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారు: హరీశ్ సాల్వే
  • అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఎ కింద తగిన అనుమతులు తీసుకోలేదు: హరీశ్ సాల్వే
  • ఈ ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధమైనది: హరీశ్ సాల్వే
  • గతంలో వచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు: హరీశ్ సాల్వే
  • సెక్షన్‌ 17ఎ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదు: హరీశ్ సాల్వే
  • ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్‌ రాజస్థాన్‌ - తేజ్‌మల్ చౌదరి కేసును ఉదహరించిన హరీశ్ సాల్వే
  • నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలి: సాల్వే
  • కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకుని సెక్షన్‌ 17ఎ వర్తిస్తుంది: సాల్వే
  • ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కనుకే ముందస్తు అనుమతి తప్పనిసరి: సాల్వే
  • ఇప్పుడు పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు: సాల్వే
  • కొత్త ప్రభుత్వం.. పాత ప్రభుత్వం మీద ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధన పెట్టారు: సాల్వే
  • ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ కౌంటర్ మాకు ఇచ్చారు: హరీశ్ సాల్వే
  • కౌంటర్‌లో కూడా గతంలో పొందుపరిచిన ఆరోపణలనే మళ్లీ చెప్పారు: సాల్వే
  • ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును ఉదహరించిన హరీశ్ సాల్వే
  • ఇది కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలి: హరీశ్ సాల్వే
  • వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు: సాల్వే
  • హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి: హరీశ్ సాల్వే
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీన్ని ప్రతీకారపూర్వక కేసుగానే పరిగణించాలి: సాల్వే
  • ఇదే కేసుకు సంబంధించిన జీఎస్‌టీ ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించింది: హరీశ్ సాల్వే
  • ప్రాజెక్టులో 90 శాతం ప్రైవేటు సంస్థ.. 10 శాతం ప్రభుత్వం భరిస్తుంది: హరీశ్ సాల్వే
  • యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు ఏర్పాటు: సాల్వే
  • ఈ సందర్భంగా జీఎస్‌టీ కేసూ ప్రతీకార చర్యేనా అని ప్రశ్నించిన ప్రభుత్వ న్యాయవాది: సాల్వే
  • నిన్న రాత్రే కౌంటర్ ఇచ్చి ఉండాల్సిందని ప్రస్తావించిన హరీశ్ సాల్వే
  • అతి సన్నిహితులు ఈ కేసుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు..
  • అంతా నిశ్శబ్దంగా జరిగింది: సాల్వే
  • ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే జరిగినట్లుగా కనిపిస్తోంది: సాల్వే
  • ఈ కేసుకు ప్రాతిపదికైన ప్రాజెక్టు రిపోర్టులు, వాటి విలువ మదింపు చేశారు: సాల్వే
  • వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి: హరీశ్ సాల్వే
  • స్కిల్ డెవలప్‌మెంట్ మదింపు నివేదికను కోర్టు ముందు చదివి వినిపించిన సాల్వే
  • నగదు అంశమే ప్రభుత్వానికి సంబంధించింది.. మిగతావన్నీ కూడా ప్రైవేట్‌ సేవలే: సాల్వే
  • స్కిల్‌ సెంటర్లకు భూమి, అనుమతితో పాటు రూ.330 కోట్లు చెల్లించాలని ఒప్పందం: సాల్వే
  • రూ.330 కోట్లు ఉంటే మొత్తం ప్రాజెక్టు విలువలో దాదాపు 10 శాతానికి సమానం: హరీశ్ సాల్వే
  • ఈ మొత్తం ప్రాజెక్టులో రాష్ట్ర భాగస్వామ్యం చాలా స్వల్పం.. ప్రైవేటు సంస్థలదే అధిక బాధ్యత: హరీశ్ సాల్వే
  • ఈ ఒప్పందం తర్వాత ఎవరు ఏం చేయాలనే దానిపైనా అంగీకారపత్రం తీసుకున్నారు: హరీశ్ సాల్వే
  • ప్రాజెక్టు ప్రతిపాదించారు.. పూర్తయ్యింది.. ప్రభుత్వానికి అందించారు..: హరీశ్ సాల్వే
  • ప్రభుత్వానికి అప్పగించిన ఒప్పందాలు, సంతకాలు కూడా పూర్తయ్యాయి: హరీశ్ సాల్వే
  • ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగమే: హరీశ్ సాల్వే
  • అనుబంధ సంస్థే కేంద్రాలను ఏర్పాటు చేసిందని సీమెన్స్‌ స్పష్టం చేసింది: హరీశ్ సాల్వే
  • కేంద్రాల ఏర్పాటు పూర్తయ్యింది.. ప్రభుత్వానికి అందించారు.. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు..: హరీశ్ సాల్వే

14:01 September 19

హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

  • హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా
  • ఈ ఫిర్యాదును ఆమూలాగ్రం పరిశీలిస్తే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కాలేదన్న విషయం చెప్పలేకపోయారు
  • సెన్‌వ్యాట్‌ సంబంధించిన అంశాల ఆధారంగా శిక్షణా కేంద్రాల ఛైర్మన్ ఫిర్యాదు చేశారు
  • ఇదొక అసంబద్ధ ఆరోపణ.. ఇది కేవలం పన్ను చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు..
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నడుస్తున్నాయి..
  • ఒకవేళ ఇన్‌వాయిస్‌లు పెంచి చూపించారన్నా అది అంతర్గత అంశమే

13:57 September 19

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ

  • అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఎ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదు: హరీశ్ సాల్వే

  • నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు సమయంలో ఉన్న చట్టబద్ధతను పరిగణనలోకి తీసుకోవాలి: హరీశ్ సాల్వే
  • కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకుని అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఎ వర్తిస్తుంది
  • ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ముందస్తు అనుమతి తప్పనిసరి
  • ఇప్పుడు పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదు అనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు
  • కొత్త ప్రభుత్వం.. పాత ప్రభుత్వం మీద ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధనలో చట్టంలో పొందుపరిచారు
  • ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం అరగంట క్రితమే కౌంటర్ మాకు ఇచ్చారు
  • కౌంటర్‌లో కూడా గతంలో పొందుపరిచిన ఆరోపణలనే మళ్లీ చెప్పారు

  • వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు
  • హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి
  • 2024 ఎన్నికలు కనుచూపు మేరలో కనిపిస్తున్న వేళ దీన్ని ప్రతీకారపూర్వక కేసుగానే పరిగణించాలి
  • ఇదే కేసుకు సంబంధించిన జీఎస్‌టీ ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించింది
  • ఈ కేసుకు ఆధారంమైన ప్రాజెక్టులో 90 శాతం ప్రైవేటు సంస్థలు.. 10 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది
  • యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు
  • ఈ సందర్భంగా జీఎస్‌టీ కేసు కూడా ప్రతీకార చర్యేనా అంటూ ప్రశ్నించిన ప్రభుత్వ న్యాయవాది

  • అతి సన్నిహితులు ఈ కేసుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు
  • అంతా నిశ్శబ్దంగా జరిగిపోయింది
  • ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే జరిగినట్లుగా కనిపిస్తోంది
  • ఈ కేసుకు ప్రాతిపదిక అయిన ప్రాజెక్టు రిపోర్టులు, వాటి విలువ మదింపు చేశారు..
  • వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి
  • స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మదింపు నివేదికను కోర్టు ముందు చదివి వినిపించిన హరీశ్ సాల్వే
  • నగదు అంశం మాత్రమే ప్రభుత్వానికి సంబంధించింది.. మిగతావన్నీ కూడా ప్రైవేటు సేవలే..
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన భూమి, అనుమతులతోపాటు రూ.330 కోట్లు చెల్లించాలన్నదే ఒప్పందం
  • రూ.330 కోట్లు ఉంటే మొత్తం ప్రాజెక్టు విలువలో దాదాపు 10 శాతానికి సమానం
  • ఈ మొత్తం ప్రాజెక్టులో రాష్ట్ర భాగస్వామ్యం చాలా స్వల్పం.. ప్రైవేటు సంస్థలదే అధిక బాధ్యత
  • ఈ ఒప్పందం తర్వాత ఎవరు ఏం చేయాలనే దానిపైనా అంగీకారపత్రం తీసుకున్నారు
  • ప్రాజెక్టు ప్రతిపాదించారు.. పూర్తయ్యింది.. ప్రభుత్వానికి అందించారు..
  • ప్రభుత్వానికి అప్పగించిన ఒప్పందాలు, సంతకాలు కూడా పూర్తయ్యాయి
  • ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగమే
  • అనుబంధ సంస్థే కేంద్రాలను ఏర్పాటు చేసిందని సీమెన్స్‌ స్పష్టం చేసింది
  • కేంద్రాల ఏర్పాటు పూర్తయ్యింది.. ప్రభుత్వానికి అందించారు.. ఈ విషయంలో ఇష్యూ లేదు..

13:26 September 19

12:57 September 19

జగన్‌ పరిపాలనను మహిళలు తిట్టుకుంటున్నారు

  • జగన్‌ పరిపాలనను మహిళలు తిట్టుకుంటున్నారు
  • ఉద్యోగులు, వ్యాపారులు కూడా జగన్‌ను తిట్టుకుంటున్నారు
  • జగన్‌ జైలులో ఉన్నప్పుడు ఎవరైనా బయటకు వచ్చి మద్దతిచ్చారా
  • రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు
  • స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని అనేకమంది చెప్పారు
  • చంద్రబాబు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలిసింది
  • జగన్ కూడా బెయిల్‌పైనే బయట తిరుగుతున్నారు
  • చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేవరకు మా నిరసనలు

12:53 September 19

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ

  • హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే
  • పీసీ యాక్ట్ 17ఏపై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు న్యాయవాది హరీశ్‌ సాల్వే
  • ఎన్నికల దృష్ట్యా కేసు నమోదు చేశారని హరీశ్‌ సాల్వే వాదన
  • చంద్రబాబుపై దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని హరీశ్‌ సాల్వే వాదన

12:21 September 19

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

  • హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసు.. విచారణ ఈ నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు

  • ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • విచారణ ఈ నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు

12:20 September 19

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
  • సీఐడీ కేసులో బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన చంద్రబాబు

12:02 September 19

చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ఖండించేందుకే రోడ్లపైకి వచ్చాం: ఐటీ ఉద్యోగులు

  • చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ఖండించేందుకే రోడ్లపైకి వచ్చాం: ఐటీ ఉద్యోగులు
  • ప్రత్యేక హోదా తెస్తారనే ఆశతోనే జగన్‌కు ఓటేశారు: ఐటీ ఉద్యోగులు
  • చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకే అక్రమ కేసులు: ఐటీ ఉద్యోగులు

12:01 September 19

ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదు: ఐటీ ఉద్యోగులు

  • ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదు: ఐటీ ఉద్యోగులు
  • మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేస్తున్నారు: ఐటీ ఉద్యోగులు
  • పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారు: ఐటీ ఉద్యోగులు
  • చంద్రబాబు బయటకు వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం: ఐటీ ఉద్యోగులు
  • చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీకి అనేక పరిశ్రమలు వస్తాయి: ఐటీ ఉద్యోగులు
  • చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది: ఐటీ ఉద్యోగులు
  • ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందితే మేం అక్కడికే వచ్చేస్తాం: ఐటీ ఉద్యోగులు
  • ఏపీలో అవకాశాలు లేకే పక్క రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేస్తున్నాం: ఐటీ ఉద్యోగులు

12:01 September 19

ఏపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి: ఐటీ ఉద్యోగులు

ఏపీలో పరిస్థితులు బాగుంటే మేం స్వరాష్ట్రానికే వచ్చేస్తాం: ఐటీ ఉద్యోగులు

వాలంటీర్ల జీవితాలను సీఎం జగన్‌ నాశనం చేస్తున్నారు: ఐటీ ఉద్యోగులు

చంద్రబాబు ముందుచూపు వల్లే మాకు ఉద్యోగాలు వచ్చాయి: ఐటీ ఉద్యోగులు

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి: ఐటీ ఉద్యోగులు

ఏపీ భవిష్యత్తు బాగుండాలనే మేం పోరాటం చేస్తున్నాం: ఐటీ ఉద్యోగులు

12:00 September 19

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చెన్నైలో ర్యాలీ

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చెన్నైలో ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, తెదేపా అభిమానులు, జనసేన కార్యకర్తలు
  • మా జీవితాలను చంద్రబాబే బాగు చేశారు: ఐటీ ఉద్యోగులు
  • ఏపీలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి..: ఐటీ ఉద్యోగులు
  • ప్రజల్లో ఉండాల్సిన నాయకుడిని జైలులో పెట్టారు: ఐటీ ఉద్యోగులు
  • ఏపీలో మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి: ఐటీ ఉద్యోగులు
  • చంద్రబాబుకు మద్దతుగా దేశవిదేశాల్లో ధర్నాలు చేస్తున్నారు: ఐటీ ఉద్యోగులు
  • స్వచ్ఛందంగా ముందుకువచ్చి చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు: ఐటీ ఉద్యోగులు

11:32 September 19

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ పూజలు

  • గుంటూరు: నాజ్ సెంటర్‌లో ఆంజనేయస్వామి గుడి వద్ద పోలీసుల మోహరింపు
  • పోలీసుల ఆంక్షలు దాటుకుని ఆలయానికి వచ్చిన తెదేపా నాయకులు
  • చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ పూజలు
  • పూజలు నిర్వహించి బయటకు వచ్చాక నేతల అరెస్టుకు పోలీసుల ఏర్పాట్లు
  • నాజ్ సెంటర్‌లోని ఆంజనేయస్వామి గుడికి చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ
  • చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ పూజలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • మిగతా తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై కన్నా ఆగ్రహం
  • పోలీసుల ఆంక్షలు దాటుకుని ఆంజనేయస్వామి గుడికి వచ్చిన జీవీ ఆంజనేయులు
  • ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జీవీ ఆంజనేయులు

11:32 September 19

నేడు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు సంబంధించిన 3 కేసుల విచారణ

  • నేడు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు సంబంధించిన 3 కేసుల విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ
  • అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ
  • ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే
  • సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించే అవకాశం
  • వర్చువల్‌గా జరగనున్న విచారణ
  • మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు వచ్చే అవకాశం

10:58 September 19

విశాఖలో పోలమాంబ ఆలయం వద్ద మహిళల పూజలు

  • విశాఖ: పోలమాంబ ఆలయం వద్ద మహిళల పూజలు
  • చంద్రబాబు జైలునుంచి విడుదల కావాలంటూ మహిళల పూజలు
  • చంద్రబాబును అక్రమ కేసులతో అరెస్టు చేశారు: మహిళలు
  • మహిళలకు ఎంతో ఉన్నతస్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదే
  • చంద్రబాబు వెనుక న్యాయం ఉంది కనుకే అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు
  • యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం కూడా నేరమేనా?
  • చంద్రబాబు అంటేనే అభివృద్ధి.. అభివృద్ధి అంటేనే చంద్రబాబు..
  • చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు వస్తుందని మా నమ్మకం

10:57 September 19

చంద్రబాబుకు బెయిల్‌ రావాలంటూ మంగళగిరిలో మెట్ల పూజ

  • చంద్రబాబుకు బెయిల్‌ రావాలంటూ మంగళగిరిలో మెట్ల పూజ
  • మంగళగిరిలో మెట్ల పూజ నిర్వహించిన తెదేపా నేతలు
  • పానకాలస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన నేతలు

10:44 September 19

తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ గృహనిర్బంధం

  • గుంటూరు: తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ గృహనిర్బంధం
  • పోలీసులు, మన్నవ మోహనకృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం
  • దేవుడి దగ్గరకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు: మన్నవ మోహనకృష్ణ
  • పోలీసులను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు: మన్నవ మోహనకృష్ణ
  • జగన్‌కు దమ్ముంటే చంద్రబాబుపై పెట్టిన కేసును నిరూపించాలి: మన్నవ మోహనకృష్ణ

10:43 September 19

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో బైక్‌ ర్యాలీ

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో బైక్‌ ర్యాలీ
  • నల్ల టీషర్టులు ధరించి ర్యాలీ చేస్తున్న తెదేపా కార్యకర్తలు
  • సంగారెడ్డి: జడ్పీ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ
  • సంగారెడ్డి: ఐటీఐ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ
  • సంగారెడ్డి: చంద్రబాబుకు బెయిల్‌ రావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు
  • దేవాలయం, చర్చి, మసీదుల్లో పూజలు చేయనున్న తెదేపా శ్రేణులు
  • ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించనున్న తెదేపా నేతలు

10:29 September 19

మంగళగిరిలో మెట్ల పూజలు నిర్వహించిన తెదేపా నేతలు

  • చంద్రబాబుకు బెయిల్‌ రావాలంటూ మంగళగిరిలో మెట్ల పూజలు నిర్వహించిన తెదేపా నేతలు
  • పానకాల స్వామి ఆలయంలో 362 మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి పూజలు చేసిన తెదేపా నేతలు

10:29 September 19

విశాఖలో తెదేపా నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

  • విశాఖలో తెదేపా నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • విశాఖ: చినవాల్తేరులో అచ్చెన్నాయుడు గృహనిర్బంధం
  • విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గృహనిర్బంధం
  • విశాఖ: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గృహనిర్బంధం
  • అనకాపల్లి: మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును అడ్డుకున్న పోలీసులు
  • విశాఖ: పల్లా శ్రీనివాస్‌, కోరాడ రాజబాబు గృహనిర్బంధం

10:08 September 19

శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రకు టీడీపీ పిలుపు

  • శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రకు టీడీపీ పిలుపు
  • టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • బెందాళం అశోక్, కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు గృహనిర్బంధం

10:08 September 19

విశాఖ: సింహాచలం వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రయత్నం

  • విశాఖ: సింహాచలం వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రయత్నం
  • టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • చంద్రబాబు విడుదల కాంక్షిస్తూ మొక్కుకునేందుకు వెళ్తుండగా అడ్డగింత
  • దైవదర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై టీడీపీ నేతల ఆగ్రహం
  • సింహాచలం కొండ కింద గిడ్డి ఈశ్వరిని అడ్డుకున్న పోలీసులు

10:07 September 19

గుంటూరులో టీడీపీ నేతల గృహనిర్బంధం

  • గుంటూరులో టీడీపీ నేతల గృహనిర్బంధం
  • చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ ఆంజనేయస్వామి గుడిలో పూజలకు పిలుపు
  • అనుమతి లేదంటూ ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు
  • జీవీ ఆంజనేయులు, కోవెలమూడి రవీంద్ర, నసీర్ గృహనిర్బంధం
  • పలువురు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

10:07 September 19

దుర్గగుడికి వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • దుర్గగుడికి వెళ్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బూరగడ్డ వేదవ్యాస్‌, రాజేంద్రప్రసాద్‌ను గవర్నర్‌పేట పీఎస్‌కు తరలింపు
  • చంద్రబాబు విడుదలను కాంక్షిస్తూ అమ్మవారికి మొక్కుకునేందుకు వెళ్తుండగా అడ్డగింత

10:06 September 19

గుంటూరులో టీడీపీ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

  • గుంటూరులో టీడీపీ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
  • శారదా కాలనీ ఆర్చ్‌ సెంటర్ నుంచి నాజ్ సెంటర్ ఆంజనేయస్వామి గుడి వరకు ర్యాలీకి ఏర్పాట్లు
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేతల ర్యాలీ, ప్రత్యేక ప్రార్థనలు
  • టీడీపీ నేతల ర్యాలీకి అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు
  • రోడ్డుపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
  • టీడీపీ నేతల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు
  • శారద కాలనీ నుంచి నాజ్ సెంటర్‌కు వెళ్లే దారిలో పోలీసుల మోహరింపు
  • నక్కా ఆనంద్‌బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారి గృహనిర్బంధం

10:06 September 19

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు

  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు
  • ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
  • కనకదుర్గమ్మకు సారె సమర్పించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల నిర్ణయం
  • కొండ కింద ఉన్న వినాయక గుడి నుంచి దుర్గగుడికి పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయం
  • కార్యక్రమం నిర్వహించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

10:06 September 19

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ

  • హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ
  • చంద్రబాబును అరెస్టు చేయడం చట్టవిరుద్ధమన్న ఆయన తరఫు న్యాయవాది
  • ప్రతిపక్ష నేత అరెస్టుకు గవర్నర్‌ అనుమతి తీసుకోవాలన్న న్యాయవాది
  • గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్టు చేశారని గతంలోనే వాదించిన న్యాయవాది
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని గతంలో వాదించిన న్యాయవాది
  • చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

10:05 September 19

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌పై చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌పై చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

స్కిల్‌ కేసులో బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్‌

  • స్కిల్‌ కేసులో బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ

10:05 September 19

చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం

  • చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం
  • చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌
  • కౌంటర్ దాఖలుకు చంద్రబాబుపై ఒత్తిడి తేవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశం

10:04 September 19

దిల్లీ: రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన టీడీపీ నేతలు

  • దిల్లీ: రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన టీడీపీ నేతలు
  • నివాళులు అర్పించిన నారా లోకేష్‌, టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టిన నేతలు

10:04 September 19

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నేడు హైకోర్టులో విచారణ

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
  • చంద్రబాబును చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని వాదించిన సిద్ధార్థ లూథ్రా

10:04 September 19

ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసి బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా నేడు విచారణ

  • ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసి బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా నేడు విచారణ
  • సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ పైనా నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం

10:03 September 19

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ నేడు హైకోర్టులో విచారణ

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ నేడు హైకోర్టులో విచారణ
  • బెయిల్‌ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ పైనా ఇవాళ హైకోర్టులో విచారణ

09:47 September 19

Live Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్ వద్ద ఎంపీల నిరసన

  • ఇవాళ ఉదయం 7గంటలకు రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్న టీడీపీ ఎంపీలు
  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్ వద్ద ఎంపీల నిరసన

Last Updated : Sep 19, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.