ప్రతిధ్వని: 'నూతన విద్యా విధానం...విద్యార్థులకు వరం' - new education policy 2020
🎬 Watch Now: Feature Video

డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 34 సంవత్సరాలు తర్వాత కీలక మార్పులతో ముందుకువచ్చిన కొత్త విద్యా విధానం.. విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్ద పీట వేసింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన, ఉన్నత విద్యలోనూ అమ్మ భాషకు ప్రాధాన్యం, విద్యార్థులు ఇష్టమైన కోర్సులు చదువుకునే వెసులుబాటు, పాఠశాల విద్య పూర్తిచేసుకునే నాటికి వృత్తి విద్యా నైపుణ్యం ఉండేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. అన్ని కోర్సుల్లో హోలిస్టిక్ మల్టీ డిసిప్లీనరీ విధానాన్ని తీసుకువచ్చారు. డిగ్రీ విద్యార్థి ఏ సంవత్సరంలో చదువు మానేసినప్పటికీ ప్రయోజనం పొందేలా కీలకమైన సంస్కరణలు తెచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ నూతన విద్యా విధానంలోని ప్రధాన అంశాలపై ప్రతిధ్వని చర్చ...