బ్యాంకులు...మెుండి బకాయిల భారం..! - ఈటీవీ చర్చాకార్యక్రమాలు
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభం వలన భారత బ్యాంకింగ్ రంగం కోలుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని... అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ అంచనా వేసింది. 2019-20లో 8.5గా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి.. 2020-21లో 14 శాతానికి పెరగొచ్చని తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణలో ఎన్పీఏలు గుర్తించడం వాయిదా పడొచ్చేమోగాని.. అది సమస్యకు పరిష్కారం మాత్రం కాదని పేర్కొంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవడమే కాకుండా మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సమస్యలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 సంక్షోభం ప్రభావం బ్యాంకింగ్ రంగంపై ఎంతకాలం ఉంటుంది.. కోలుకునే మార్గాలేమిటనే అంశాలపై ప్రతిధ్వని చర్చ..
Last Updated : Jul 1, 2020, 11:07 PM IST