ప్రతిధ్వని: డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్రం మార్గదర్శకాలు ఏమిటి? - కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
🎬 Watch Now: Feature Video
విద్యుత్‌రంగ సంస్కరణలకు సంబంధించి కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్రం విద్యుత్ శాఖ డిస్కంల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్కంలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలను స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి డిస్కంలను అప్పగించాలి. ఆ ముసాయిదా ప్రకారం ఓ ప్రైవేటు కంపెనీ లేదా కొన్ని కంపెనీల కన్సార్టియం కూడా డిస్కంలను కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో డిస్కంల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.