ప్రతిధ్వని: పండుగల వేళ కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? - వ్యాక్సిన్ వచ్చే వరకు
🎬 Watch Now: Feature Video

దేశంలో వచ్చే ఫిబ్రవరి నాటికల్లా కరోనా నియంత్రణలోకి వస్తుందని కొవిడ్‌పై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం పాటిస్తున్న కరోనా నిబంధనలు అందరూ పాటించాలని.. లేకపోతే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ..మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? పండుగలను ఎలాంటి జాగ్రత్తలతో జరుపుకోవాలి? అనే అంశాలకు సంబంధించి ఈనాటి ప్రతిధ్వని చర్చ.