భారత్, అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? - Prathidwani
🎬 Watch Now: Feature Video

భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల వ్యక్తిగత సాన్నిహిత్యం రెండు దేశాల మధ్య బలమైన బాంధవ్యానికి దారి తీసింది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తీవ్రవాదం, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవటంలో భారత్‌తో కలిసి పనిచేస్తానని జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నాని తెలిపారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై ప్రతిధ్వని చర్చ.