Prathidwani: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ చార్జీల వాతలు తప్పవా ? - విద్యుత్ ఛార్జీలపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
ఇంటి పన్నులు, చెత్త పన్నులతో పాటు విద్యుత్ ఛార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు నుంచి కొత్త ఛార్జీలతో ప్రజల నడ్డివిరిచేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఛార్జీలతో పాటు స్లాబులను కూడా కుదిస్తూ డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. గృహ వినియోగదారులను రెండు కేటగిరులుగా మాత్రమే విభజించి వినియోగదారుల ముక్కుపిండి వసూళ్లు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలు కాచుకొని కూర్చున్నాయి. ఏపీఈఆర్సీ ఆమోదం తెలియజేస్తే.. విద్యుత్ వినియోగదారులపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశాలున్నాయి. నిర్వహణ లోపం కారణంగా తలెత్తున్న నష్టాల్ని పూర్తిగా వినియోగదారులపై వేసేందుకు డిస్కంలు ఎదురుచూస్తున్నాయి. అసలు దీనికి అడ్డూఅదుపు ఎక్కడుంది ?. విద్యుత్ నియంత్రణ మండలి దీనిని నిలువరించగలదా ? అనే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST