Person Died After Falling from Collapsed Bridge at Penna River: ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - ap news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 12:17 PM IST
Person Died After Falling from Collapsed Bridge at Penna River : అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పోచనపల్లిలో చోటు చేసుకుంది. పెన్నా నది వద్ద కూలిన బ్రిడ్జి పైనుంచి కింద పడి కర్ణాటకకు చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. బ్రిడ్జి వద్ద అధికారులు ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియక బైక్ పై వస్తూ శివ కింద జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో శివ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.
తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని,.. ఈ కారణంగానే శివ మృతి చెందాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి కూలి రెండు సంవత్సరాలు అవుతున్నా.. కనీసం మరమ్మతులు చేయలేదని మండిపడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.
TAGGED:
పెన్నానది కర్ణాటక వాసి మృతి