రాజకీయంగా ఎవరి నిర్ణయం వారిదే - షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు - congress party

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 8:07 PM IST

YV Subba Reddy Reaction on YS Sharmila: అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురంలో టిడ్కో ఇళ్లను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ సత్యవతితో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలు అందించిన సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వాన్ని కాపాడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గురించి వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎవరి నిర్ణయం వారిదని, దానిపై తాను ఏమీ మాట్లాడనని అన్నారు. అయితే ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని పేర్కొన్నారు. అదే విధంగా గెలుపు అవకాశాలు ఉన్న వారికే పార్టీలో సీట్లు ఇస్తున్నారని తెలిపారు. 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ సముచిత అవకాశాలు కల్పిస్తామని ఒప్పిస్తున్నామని స్పష్టం చేశారు. చెప్పిన తరువాతే సీట్ల మార్పు జరుగుతుందని, ఇవి నచ్చని వారు మాత్రమే పార్టీ మారుతున్నారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.