MP MVV on Kidnap: కత్తులతో బెదిరించి.. హింసించి డబ్బులు వసూలు చేశారు: ఎంపీ ఎంవీవీ
🎬 Watch Now: Feature Video
MP MVV on Kidnap Incident: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన కుటుంబ సభ్యులు అపహరణకు గురైన ఉదంతంపై మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన భార్య, కుమారుడు కిడ్నాప్ అయినట్లు పోలీసులు చెప్పేదాకా తనకు తెలియదని, కిడ్నాపర్లు క్రూరంగా హింసించి తన కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కత్తులతో బెదిరించి క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత జీవీని కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్పారు. మరికొన్ని నిమిషాలకు హేమంత్ అనే వ్యక్తి (కిడ్నాపర్)ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెప్పారు. పోలీసులు చెప్పే వరకు నా కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లు నాకు తెలియదు. కిడ్నాపర్లు నా కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసించారు. ఏ2 రాజేశ్‌పై 40కి పైగా కేసులు ఉన్నాయి. మూడు రోజులు రెక్కీ నిర్వహించి నా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. హేమంత్ అనే వ్యక్తితో నాకు గతంలో ఎలాంటి సంబంధం లేదు. విశాఖలో రక్షణ లేదని కొందరు అనటం సరికాదు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. చిన్న చిన్న ఘటనలు ఎక్కడైనా జరగటం సహజం. విశాఖలు శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి'' అని ఆయన అన్నారు.