YSRCP Leaders Attack: కర్నూలులో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. జనసేన నేతపై రాడ్డుతో దాడి - కర్నూలు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Kurnool YSRCP Leaders Attack: కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన కార్యకర్తపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపర్చారు. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన వివాదం.. ముదిరి చివరకు దాడికి దారి తీసింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని.. ఆదోనిలో విజయ్ అనే జనసేన కార్యకర్తపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. దీనిపై బాధితుడు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప.. ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడిన విజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను పోస్టులు పెట్టకపోయినా తనపై దాడికి దిగారని బాధితుడు వాపోయారు. తాను ఎటువంటి పోస్టులు పెట్టలేదని కావాలంటే చెక్ చేసుకోమని తన సెల్ఫోన్ వారికి ఇచ్చినా.. పట్టించుకోకుండా దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదని.. కేవలం అభివృద్ధిపై మాత్రమే ప్రశ్నించినందుకు దాడి చేశారని అదోని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ ఆరోపించారు. ముష్టిఘాతాలు కురిపిస్తూ.. ఇనుప రాడ్డుతో దాడికి దిగారని ఆయన తెలిపారు.