YSRCP Leader Misbehavior With Women: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. అడిగిన మహిళలతో అసభ్య ప్రవర్తన - మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేత
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 9:22 PM IST
YSRCP Leader Misbehavior With Women: శ్రీకాకుళం జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. స్థలాన్ని అక్రమించుకుని దానిలో కంచె ఏర్పాటు చేయగా.. దానిని తొలగించాలని ప్రయత్నించిన స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. మీ అంతూ చూస్తానంటూ బెదిరించాడని మహిళలు వాపోయారు. వైసీపీ నేత ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయగా.. ఇటీవలే ఆ స్థలంలో విద్యుత్ మీటర్ బిగించటంతో స్థానికులు మండిపడుతున్నారు.
జిల్లాలోని రణస్థలం మండలం జేఆర్పురంలోని సీఐ కార్యాలయం వెనక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని.. వైసీపీ నేత కబ్జా చేయటంతో వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటంతో.. స్థానిక కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం ఆ స్థలంలో కాలనీలకు వచ్చే వాహనాలను నిలిపి ఉంచగా.. ఇప్పుడు కంచె ఏర్పాటుతో ఇబ్బందిగా మారింది. వివాదంలో ఉన్న ఆ స్థలానికి ఇటీవలే విద్యుత్ మీటర్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికి మహిళలు కంచెను తొలగించారు. కంచె తొలగిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ నేత మీ అంతు చూస్తానంటూ బెదిరించి.. అసభ్యంగా ప్రవర్తించాడని మహిళలు ఆరోపించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని.. ప్రభుత్వాధికారులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.