YSRCP Leader Attack on ST Womens: చేయని దొంగతనం ఒప్పుకోవాలని.. ఎస్టీ మహిళలపై వైసీపీ నాయకుడు విచక్షణారహితంగా దాడి - ycp leaders news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 2:15 PM IST

YSRCP Leader Attack on ST Womens: ఇంట్లో దొంగతనం చేశారనే అనుమానంతో, నేరం ఒప్పుకోవాలంటూ ఇద్దరు ఎస్టీ మహిళలపై ఓ వైసీపీ నాయకుడు తీవ్రంగా దాడి చేసి, ఆ తర్వాత పోలీసుల చేత కొట్టించిన సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెంలో సంచలనంగా మారింది. మహిళలపై దాడి చేశారన్న విషయం తెలుసుకున్న మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్.. బాధితులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి,  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Victimized women Comments: బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..''కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజా అనే వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ ఉందని, కొద్ది రోజుల పాటు ఇంటి పని చేయాలంటూ పనికి పిలిచారు. ఆ తర్వాత ఇంట్లో దొంగతనం జరిగిందని, ఆ దొంగతనం నేనే చేశానంటూ విచక్షణారహితంగా కొట్టారు. దాంతో నా తలకు, ఒళ్లంతా గాయాలయ్యాయి. నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా.. బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవాలంటూ మరోమారు పోలీసులతో కొట్టించారు. ప్రశ్నించిన మా అమ్మను కూడా కొట్టారు'' అని బాధితులు కన్నీంటిపర్యంతమయ్యారు.

''తీవ్ర గాయలతో ఇబ్బంది పడుతున్న బాధితులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాం. బాధితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఆయన కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను సేకరించిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.''-గోవర్థన్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.