అధికార పార్టీ వికృత చేష్టలు - ప్రభుత్వ కార్యాలయంలోకి స్వాగతం పలుకుతున్న వైసీపీ జెండా - YCP flag at government office in anantapur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 12:43 PM IST

YSRCP Flag at RWS Office Uravakonda: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే.. క్రమంలో వైసీపీ వికృత చేష్టలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. అధికారం కోసం చేయవలసిన దుశ్చర్యలన్నీ చేస్తోంది. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ దృశ్యం. ఇక్కడ కనిపిస్తున్న వైసీపీ జెండాను చూస్తే ఎవరైనా సరే.. అది పార్టీ కార్యాలయం అని అనుకుంటారు. కానీ ఇది ఆ పార్టీ కార్యాలయం కాదు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఆర్​డబ్ల్యూఎస్ (Rural Water Supply) కార్యాలయం. కానీ, ప్రస్తుతం వైసీపీ నిలయంగా మారింది. 

వైసీపీ చేపట్టిన వైఏపీనీడ్స్ జగన్ (Why AP Needs Jagan) కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఆ కార్యాలయం ప్రధాన ద్వారానికి అనుకుని దిమ్మె నిర్మించి, వైసీపీ జెండాను ఎగరేశారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా జనం రాకపోకలు సాగించే ప్రధాన దారి కావడం, కార్యాలయానికి ఆనుకుని వైసీపీ జెండాను నిర్మించడంతో.. ప్రభుత్వ భవనంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారా..! అని ప్రజలు సందేహ పడుతున్నారు. ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.