గెలిచాక ఈ ఊరు మొహం చూశారా..? ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి నిరసన సెగ.. - పెద్దారికట్లలో గడప ప్రోగ్రాం వీడియో
🎬 Watch Now: Feature Video
YCP MLA Kundur Nagarjuna Reddy Faced Protest: తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పేందుకు వైఎస్సార్సీపీ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం చేపట్టింది. అయితే ప్రజల వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలకు పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యలపై నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి నిరసన సెగ తగిలింది. కొనకనమిట్ల మండలం పెద్దారికట్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ కుటుంబం నిలదీసింది. తమకు ఏం చేశారని ఇంటి వద్దకు వచ్చారని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. గెలిచాక అసలు ఈ ఊరు మొహం చూశారా..? అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసు విషయంలో తమ కుమారుడు 10 రోజులు స్టేషన్‌లో ఉంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయింది. ఎంత వారించినా మహిళ శాంతించకపోవడంతో.. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.