Young Man Questioned Deputy CM Rajanna Dora : మన్యం జిల్లాలో రోడ్ల దుస్థితిపై ఓ యువకుడి ఆవేదన.. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర దృష్టికి.. - దెబ్బగడ్డ గ్రామంలో రాజన్న దొరకు చుక్కెదురు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 1:48 PM IST

Young Man Questioned Deputy CM Rajanna Dora on Problems in Manyam District:  పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ యువకుడు ధ్వంసమైన రోడ్లు దుస్థితిపై.. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరకు మొర పెట్టుకున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రికి రోడ్ల పరిస్థితిని వివరించాడు. ఇది మాత్రమే కాకుండా వారి ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాడు. ఇదంతా ఒకెత్తయితే..  మక్కువ మండలం జెడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్రీనివాస్ నాయుడు ఆ యువకుడి పైకి నీకేందుకంటూ చిందులు వేశాడు.

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెబ్బగడ్డ గ్రామానికి చెందిన గణేశ్​ అనే యువకుడు.. గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారిలో గర్భిణీ ప్రయాణిస్తే దారిలోనే ప్రసవం అయిపోతుందని వివరించాడు. స్థానికంగా పాఠశాల లేదని, ఆసుపత్రి లేదని.. ఈ సమస్యలను తీర్చాలని రాజన్న దొరను కోరాడు. గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్న సమయంలో.. అక్కడే ఉన్న జెడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్రీనివాస్ నాయుడు యువకుడ్ని నికేందుకంటూ గదమాయించారు.  అన్నీ పరిష్కరించేందుకు.. చర్యలు తీసుకుంటున్నామని, తెలుసుకోకుండా మాట్లాడవద్దన్నారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.