YCP leaders threatened the high officials in chittor వైసీపీ నేతల ఆగడాలు.. ఏకంగా ఉన్నతాధికారులకే బెదిరింపులు.. దిక్కుతోచని స్థితిలో ఎమ్మార్వో - శాంతిపురం మండల సమావేశంలో తహసీల్దార్ ఆవేదన
🎬 Watch Now: Feature Video

YCP leaders threatened the high officials in chittor: వైసీపీ నేతల ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాము చెప్పినట్లు వినకుంటే బదిలీ చేస్తామంటూ అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ తహసీల్దార్‌పై వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల సమావేశంలో ఓ తహశీల్దార్.. తాము చెప్పిన విధంగా నడుచుకోకుంటే బదిలీ చేస్తామని అధికార పార్టీ గ్రామ స్థాయి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టి నెలన్నర రోజులు కూడా కాకుండానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. ఇటీవల ఓ వీఆర్వోని బదిలీ చేయగా.. పది రోజులు క్రితం ఇద్దరు గ్రామ స్థాయి వైసీపీ నాయకులు తన కార్యాలయానికి వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇబ్బంది పెట్టారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట వినకపోతే బదిలీ చేస్తాం అని బెదిరించారని, ఇలా చేయడం న్యాయమా అంటూ సమావేశంలో పాలకులు, అధికారుల్ని ఆయన ప్రశ్నించారు. దీనిపై అధికారులు బదులివ్వకుండా మిన్నకుండిపోయారు.