YCP Leaders Condemned Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ఖండించిన కర్నూలు జిల్లా వైసీపీ నేతలు - ap skill development case update
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 12:15 PM IST
|Updated : Oct 10, 2023, 1:22 PM IST
YCP Leaders Condemned Chandrababu Arrest : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీలకు అతీతంగా ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టి.. వైసీపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమంగా కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు సైతం చంద్రబాబుకు అండగా నిలుస్తూ వారి గళాన్ని వినిపిస్తున్నారు. బాబు అరెస్టుతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన చెందారని వారు విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
YSRCP Leaders Support CBN Arrest in Skill Development Case : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారని.. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం మండలం మాధవరానికి చెందిన దివంగత కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కుమారుడు రాఘవేంద్ర రెడ్డి, బంధువు రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము వైసీపీలో ఉన్నా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని వారు తెలిపారు. సంఘీభావం తెలుపుతున్నామని ప్రకటించారు. బాబు అరెస్టు తర్వాత. తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని వివరించారు.