రైతులను విస్మరిస్తున్న జగన్ ప్రభుత్వం - పంట నష్టంతో ఆవేదనలో రైతులు - eluru farmers get angry on officers

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 3:28 PM IST

YCP Government Ignoring Farmers: మిగ్‌జాం తుపాను రైతులను నట్టేట ముంచింది. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పడటంతో మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. వరి కుప్పలు తడిచి ముద్దవ్వడంతో అన్నదాతల కష్టాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లాలో పొలం బాట పట్టారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, సమస్యలు పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యం కొనేందుకు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలపడంతో చింతమనేని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన కూడా స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చింతమనేని స్పష్టం చేశారు. 

Michaung Cyclone Left Loss To Farmers in Eluru: అధికారులు , ప్రభుత్వం ముందుగా అప్రమత్తమై ఉంటే రైతులకు ఇంత నష్టం ఉండకపోయేదని చింతమనేని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన,స్పందన లేకపోవడంతో చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ముందుచూపు లేనిదని మండిపడ్డారు.

No Respond From Officers about Crop Damage: పంట సమస్యల గురించి ఎమ్మార్ఓ, వీఆర్​వో, వ్యవసాయ శాఖాధికారులు దృష్టికి తీసుకెళితే ఎవరూ స్పందన లేకపోవడంతో అధికారులు అసలు ఉన్నారా అని రైతులు  ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించడం లేదని, రైతులను పట్టించుకోవడంలో జగన్ సర్కారు వైఫల్యం చెందిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన చేసును యథాాస్థితికి తీసుకురావడానికి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం అందుకోవాలని రైతులు కోరుతున్నారు. వర్షాలతో నీట మునిగిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా కనుగోలు చేస్తే కొంత మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.