కొత్త ఇన్ఛార్జి పరిచయ కార్యక్రమం, డుమ్మా కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే సహా బాలినేని- విజయసాయిరెడ్డి ఆగ్రహం - YCP Meeting in Ongole
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 2:12 PM IST
|Updated : Jan 13, 2024, 6:29 PM IST
YCP Coordinator Introductory Meeting: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త పరిచయవేదిక కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన ప్రస్తుత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గైర్హాజరు కావడం పార్టీ క్రమశిక్షణకు విరుద్దమని, పార్టీ పట్ల విధేయత ఉండాలని రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన పరిచయ వేదికలో నూతనంగా నియమించిన మంత్రి మేరుగ నాగార్జునను కార్యకర్తలుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పిన వారి విషయాన్ని పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సహజమన్న ఆయన, పార్టీ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే, తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకే తాము ప్రతివిమర్శలు, వివరణలు ఇవ్వలని కోరామే తప్పా, ప్రతిపక్షాలను పనికట్టుకొని తిట్టాలని కోరినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నందిగాం సురేష్, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. దీనికి తోడు పార్టీకి, జిల్లాకు పెద్ద దిక్కయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటోలు వేసినప్పటికీ సమావేశానికి రాకపోవడం పార్టీలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేసారు.