YCP Attack on JSP Leader in Satyasai District : ధర్మవరంలో జనసేన రాష్ట్ర నాయకుడిపై వైసీపీ వర్గీయుల దాడి... - ధర్మవరంలో జేఎస్పీ నేతలపై వైసీపీ దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 12:07 PM IST
YCP Attack on JSP Leader in Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివరాంనగర్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై వైసీపీ వర్గీయులు సామూహిక దాడికి పాల్పడ్డారు. రాజారెడ్డిపై వైసీపీ యువజన నాయకుడు వినయ్‌గౌడ్‌తోపాటు మరికొందరు ద్విచక్రవాహనాల్లో వచ్చి కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Dharmavaram lo JSP Netha Pai Dadi 2023 : రాజారెడ్డి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి సమీప బంధువు. నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉండగా ఈ దాడి జరిగింది. వైసీపీ వర్గీయుడు వినయ్ గౌడ్ మరికొందరు ద్విచక్ర వాహనాల్లో వచ్చి తనపై కర్రలతో దాడి చేశారని రాజారెడ్డి పేర్కొన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు మధుసూదన్ రెడ్డి చేరుకొని రాజారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులతో రాజారెడ్డి పై దాడి చేయించాడని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తి లేదని మధుసూదన్ రెడ్డి అన్నారు. దీనిపై జనసేన నేతలు ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.